Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story A Hearing Will Be Held Today In The Acb Court On The Petition To Hand Over Chandrababu To Cid Custody

Chandrababu Case: చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని పిటిషన్.. ఏసీబీ కోర్టులో నేడు విచారణ

Published Date :September 13, 2023 , 8:20 am
By Mahesh Jakki
Chandrababu Case: చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని పిటిషన్.. ఏసీబీ కోర్టులో నేడు విచారణ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandrababu Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు లాయర్లు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయకపోవడంతో ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కౌంటర్‌ పిటిషన్‌ను బుధవారం దాఖలు చేస్తామని చంద్రబాబు తరఫున లాయర్లు న్యాయస్థానానికి వివరించారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని హౌస్ రిమాండ్ విధించాలని వేసిన పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని ఏపీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అడ్వొకేట్‌ జనరల్‌కు లేఖ రాశారు. కోర్టు ఆదేశాల మేరకు జైలులో చంద్రబాబుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత కల్పించామని తెలిపారు.

Also Read: Amit Shah: తెలంగాణలో అమిత్ షా పర్యటన.. షెడ్యూల్‌లో కీలక మార్పు..

అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ కార్యకర్త మహేష్‌రెడ్డి, కిలారు నితిన్, గింజుపల్లి సుబ్బారావు వేరువేరుగా ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే సీఐడీ ఎఫ్ఐఆర్‌పై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు వెల్లడించారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలన్నీ రాజకీయ కక్షసాధింపులో భాగమేనని తెలిపారు. తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించారని పిటిషన్ వేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో తనను తప్పించాలంటూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

చంద్రబాబు తరపున క్వాష్ పిటిషన్ తో పాటు హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో ఏ1గా ఉన్న చంద్రబాబుకు బెయిల్ కోరుతూ మరో పిటిషన్ దాఖలు కాగా.. అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఇంకొక పిటిషన్ దాఖలైంది. చంద్రబాబుకు సంబంధించిన మూడు పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు అవకాశాలు ఉన్నాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ACB court
  • andhrapradesh
  • Chandrababu Arrest
  • Chandrababu Case
  • CID custody

తాజావార్తలు

  • Stock Market: స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్స్.. రికార్డు స్థాయిలో సిప్‌(SIP)లు.. కారణం ఇదే..

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…

  • Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?

  • Inter Results : ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!

ట్రెండింగ్‌

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions