NTV Telugu Site icon

KTR: నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్‌పై విచారణ..

Ktr

Ktr

నేడు సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈనెల 8న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేయగా.. క్వాష్ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కేటీఆర్ పిటిషన్‌ను జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారించనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ సుప్రీంకోర్టులో కేవియట్లు దాఖలు చేసింది. “ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. మా వాదన కూడా వినాలి” అని కేవియట్ పిటిషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది.

READ MORE: PM Modi: నేడు నేవీలోకి మరో మూడు యుద్ధనౌకలు.. జాతికి అంకితం చేయన్నున్న ప్రధాని మోడీ

Show comments