NTV Telugu Site icon

Molestation : ఫ్రెండ్ పెళ్లాంపై కన్నేశాడు.. ముక్కలు ముక్కలయ్యాడు

New Project (1)

New Project (1)

Molestation : స్నేహితుడి భార్యను మోహించిన యువకుడు ఆ దంపతుల చేతిలోనే కుక్క చావుచచ్చాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. స్నేహితుడిని హత్య చేసిన అనంతరం ఆ భార్యభర్తలు కత్తితో అతడి శరీరాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి కాలువలో పడేశాడు. నిందితుల జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహంలోని ఎనిమిది ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా భాగం కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. నిందితుడి నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Tragedy : కోట్లు సంపాదించిపెట్టారు.. కొడుకులు కూడు పెట్టకపోవడంతో ఉసురుతీసుకున్నారు

ఇమ్రాన్, రిజ్వానా ఇద్దరు దంపతులు. ఇమ్రాన్ స్నేహితుడు మెహరాజ్ పఠాన్. మెహ్రాజ్ తన స్నేహితుడు ఇమ్రాన్ భార్య రిజ్వానా సుల్తాన్‌పై చెడు దృష్టి పెడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆమెతో సరసాలాడుతూ శారీరక సంబంధాల కోసం ఒత్తిడి తెచ్చేవాడు. చివరకు ఈ విషయాన్ని రిజ్వానా తన భర్త ఇమ్రాన్‌కు తెలియజేసింది. దీని తర్వాత వారిద్దరూ మెహ్రాజ్‌కు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఇమ్రాన్ మెహ్రాజ్‌ని తన ఇంటికి ఆహ్వానించాడు. తర్వాత సర్ ప్రైజ్ ఇస్తానన్న పేరుతో కళ్లకు కండువా కట్టాడు. ఆపై ఇమ్రాన్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. దీని తరువాత, ఇద్దరూ మృతదేహాన్ని తొమ్మిది ముక్కలుగా నరికి, మృతదేహాన్ని కాలువలోకి విసిరారు. మరోవైపు, మెహ్రాజ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత మెహ్రాజ్‌ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also:PM Modi: ప్రధాని డిగ్రీ వివరాలు అవసరం లేదు.. కేజ్రీవాల్‌కి హైకోర్టు జరిమానా..

ఇమ్రాన్ ఇంటికి వెళుతున్నానని చెప్పి మెహ్రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. విచారణలో పోలీసులకు అనుమానం రావడంతో పోలీసులు అతడిని క్షుణ్ణంగా ప్రశ్నించారు. ఆ తర్వాత నేరం అంగీకరించి అన్ని విషయాలు చెప్పాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మొండెంనకు చెందిన ఎనిమిది ముక్కలు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తల కోసం గాలిస్తున్నారు. కాల్వలో నీటి ప్రవాహానికి యువకుడి తల కొట్టుకుపోయి ఉండొచ్చని చెబుతున్నారు.