Site icon NTV Telugu

Physical Harassment: చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం.. చిన్నారి పరిస్థితి విషమం

Sex Harrasment

Sex Harrasment

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో నాలుగేళ్ల బాలికపై ఓ క్రూరుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. వరుసకు చిన్నారి మేనకోడలు అవుతుంది. అయితే ఆ చిన్నారికి చాక్లెట్ తినిపిస్తానని చెప్పి తీసుకొని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటన తెలుసుకున్న చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.

Read Also: Chandrababu CID Custody: కాసేపట్లో ముగియనున్న చంద్రబాబు కస్టడీ.. నెక్స్ట్ ఏంటీ?

వివరాల్లోకి వెళ్తే.. ఈ హృదయ విదారక ఘటన గోపాల్‌గంజ్ జిల్లాలోని మీర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తమ ఇంటి పక్కనే నివసిస్తున్న 22 ఏళ్ల యువకుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి తన కూతురిని తీసుకెళ్లాడని బాధితురాలి తల్లి తెలిపింది. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడ్డాడని.. బాలిక ఏడుపు వినిపించడంతో ఆమె అక్కడికి వెళ్లి చూసేసరికి తాను షాక్ అయినట్లు చెప్పింది. బాలిక నేలపై పడి ఉండటం, ఆమె ప్రైవేట్ పార్టులు రక్తస్రావం అయ్యాయని పేర్కొంది. తాను అక్కడకు వెళ్లడం చూసి నిందితుడు పరారయ్యాడని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Read Also: IND vs AUS: వన్డేలలో భారత్ అత్యధిక స్కోర్లు ఇవే.. ఈరోజు మ్యాచ్లో సాధ్యమయ్యేనా..!

రక్తస్రావంతో ఉన్న బాలికను పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు గోపాల్‌గంజ్‌ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలికను ఎమర్జెన్సీ వార్డులో చేర్చగా పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. కుటుంబం మొత్తం పరారీలో ఉన్నారని బాధితురాలి తండ్రి తెలిపారు. నిందితుడిపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని బాలికకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.

Exit mobile version