Site icon NTV Telugu

SSMB : మహేశ్ బాబు – సందీప్ వంగా కాంబినేషన్‌లో సినిమా డీటెయిల్స్

Ssmb Vanga

Ssmb Vanga

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం SS రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. టాలీవుడ్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ గా పెట్టాడు రాజమౌళి. అటు మహేశ్ కూడా గ్లోబల్ మార్కెట్ లో పాగా వేయాలని చూస్తున్నాడు. ప్రియాంక చోప్రా, పృద్విరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే వారణాసి తర్వాత మహేశ్ తదుపరి సినిమా ఏంటనే దానిపై రోజుకొక న్యూస్ వినిపిస్తోంది. తాజాగా సందీప్ వంగా దర్శకత్వంలో ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : VIJAY : జన నాయగన్ సెన్సార్ వివాదం కేసులో నిర్మాతల షాకింగ్ డెషిషన్

స్పిరిట్ సినిమా తర్వాత సందీప్ వంగా మహేశ్ బాబుతో ఓ ప్రాజెక్ట్ చేస్తారని అభిమానులు గట్టిగా నమ్మారు. ముఖ్యంగా ఎస్‌ఎస్‌ రాజమౌళిప్రాజెక్ట్ పూర్తయ్యాక మహేశ్ బాబు ఖాళీ అవుతారని, వెంటనే వంగా సినిమా ప్రారంభమవుతుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కాంబినేషన్ ఇప్పట్లో జరిగే అవకాశమే లేదని సమాచారం. ఇటీవల బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సందీప్ వంగా తదుపరి సినిమా యానిమల్ పార్క్. ఈ చిత్ర షూటింగ్ 2027లో ప్రారంభం అవుతుందని’ అన్నాడు.  దీంతో వంగా – మహేశ్ బాబు కాంబినేషన్‌కు ప్రస్తుతం ఎలాంటి అవకాశం లేదని తేలిపోయింది. అంతేకాకుండా యానిమల్ పార్క్ తర్వాత కూడా సందీప్ వంగా మరో భారీ ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యారు. ఆ సినిమా అల్లు అర్జున్‌తో తెరకెక్కనుందని సమాచారం. ఈ వరుస కమిట్‌మెంట్ల కారణంగా, మహేశ్ బాబు – సందీప్ వంగా కలయికకు ఇంకా ఎక్కువ సమయం పడే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version