కొంతమంది తాగినప్పుడు వారు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..? అనే ఆలోచన లేకుండా ప్రవర్తించడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. చాలామంది మందుబాబులు సోయ తప్పి రోడ్డుపై పడిపోవడం మనం ఎక్కువగా చూస్తుంటాము. ఇకపోతే తాజాగా తెలంగాణలో ఓ యువకుడు మద్యం సేవించి పోలీస్ స్టేషన్ ఎదుట నానా హంగామా చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Breaking : సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లోకి అడుగుపెట్టిన ముద్రగడ పద్మనాభం..!
తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎదురుగా గత అర్ధరాత్రి ఒక వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి హైడ్రామా క్రియేట్ చేశాడు. పోలీస్ స్టేషన్ గేటు ముందు నడిరోడ్డు అని చూడకుండా పూర్తి నగ్నంగా మారి హంగామా మొదలుపెట్టాడు. ఇంతటితో ఆగకుండా స్టేషన్లో ఉన్న పోలీసుల పైకి కూడా ఎగిరాడు. ఈ వ్యక్తి కామారెడ్డి జిల్లా మద్దునూర్ మండలం మేనేరు గ్రామానికి చెందిన జైపాల్. పోలీస్ స్టేషన్ ఎదురుగా నిలబడి బట్టలు విప్పి నగ్నంగా నిలబడి తనకు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ పెద్ద వీరంగాన్నే సృష్టించాడు. దీంతో పోలీస్ స్టేషన్లోని పోలీసులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దాదాపు రెండు గంటలపాటు తాగుబోతు హంగామాను సముదాయించేందుకు పోలీసులు అనేక తిప్పలు పడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా.. బెదిరింపులకు లోను చేసిన జైపాల్ అసలు వినకపోవడంతో., చివరికి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకుని పోలీసులు సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు.
Also Read: Seven Days Jewellery: అసలు ఏడువారాల నగలు అంటే ఏంటో తెలుసా మీకు..?!
దాంతో జైపాల్ కుటుంబ సభ్యులు హుటాహుటిన సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అతనిని సముదాయించడంతో.. ఆ తర్వాత పోలీసులు జైపాల్, ఆయన కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.