Bus Fire Accident: బస్సులో ఒక్కసారిగా మంటలు.. ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు
- ఢిల్లీ నుంచి బీహార్ లోని సుపాల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.
- ఒక్కసారిగా మంటలు
- ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Fire Accident: ఢిల్లీ నుంచి బీహార్ లోని సుపాల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో బాద్సా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు బస్సులో నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారని సమాచారం. హత్రాస్ జిల్లా సదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిధావలి గ్రామ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది.
Read Also: Eknath Shinde: సీఎంను దేశద్రోహి అని పిలిచినందుకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాల్సిందే
Also Read
సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని వజీరాబాద్ నుంచి డబుల్ డెక్కర్ బస్సు రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రయాణికులతో బీహార్‌లోని సుపాల్‌కు వెళ్తోంది. ఆయితే ప్రయాణంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు బస్సు పైకప్పుపై ఉంచిన లగేజీ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు ఎగసిపడుతుండడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలో ప్రయాణికులు వెంటనే బస్సును ఆపి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే సమయానికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం తర్వాత యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అగ్నిప్రమాదానికి సరైన కారణం ప్రస్తుతం తెలియరాలేదు. కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు.
Read Also: NTV Effect: గోదావరి తీరంలో దుర్గంధ ఘటన.. సిబ్బందితో వర్థ్యాలు తొలిగింపు..
ఈ ఘటన సుదూర ప్రయాణాల్లో భద్రతపై మరోసారి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అదృష్టవశాత్తూ, ప్రమాదంలో ఏ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోలేదు. కానీ సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోతే, ఫలితం భిన్నంగా ఉండేది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!