Site icon NTV Telugu

CID: పదేళ్ల తర్వాత తెలంగాణలో మొదటిసారి సీఐడి కేసు..

Cid

Cid

తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత మొదటిసారి సీఐడి కేసు నమోదు అయింది. నకిలీ వీసా, పాస్ పోర్టులు ఇప్పిస్తున్న ముఠాను సీఐడి అధికారులు పట్టుకున్నారు. కాగా.. ఐదు జిల్లాల్లో మూకుమ్మడిగా సోదాలు నిర్వహించింది. తెలంగాణలో సీఐడి అధికారుల దాడులు చేపట్టిన ప్రదేశాల్లో.. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్ లలో సోదాలు చేపట్టారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్టులు.. విదేశీయులకు పాస్‌పోర్టులు పొందేందుకు అవసరమైన నకిలీ పత్రాలు తయారీ చేస్తుంది ముఠా.

Read Also: Ponguleti Srinivas Reddy: ఇది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా పని చేస్తాం

అంతేకాకుండా.. నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ స్లాట్ లను బుకింగ్ కూడా చేస్తుంది ముఠా. కాగా.. ఇప్పటి వరకు వందమంది విదేశీయులకు ఇండియన్ పాస్ పోర్టును అందజేసింది. వాటితో పాటు.. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ లను తయారు చేస్తుంది. ఈ క్రమంలో.. సోదాలు నిర్వహించిన సీఐడీ బృందం 108 పాస్ పోర్టులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. ప్రధాన నిందితుడు అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరి అరెస్ట్ చేశారు. జవహరితో పాటు మరో 11 మందిని అరెస్టు చేసింది సీఐడి బృందం. ఈ ముఠా శ్రీలంక దేశం నుండి వచ్చిన రెఫ్యూజీలకు పాస్‌పోర్ట్‌లను ఇప్పిస్తుంది.

Read Also: Suicide: రూ.500 కోసం భార్యాభర్తలు ఆత్మహత్య

Exit mobile version