చైనా దేశంలో బర్త్ రేట్ నానాటికీ తగ్గుతోంది. జననాల్లో క్షీణత స్ఫష్టంగా కనిపిస్తోంది. దీంతో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ బిడ్డల్ని కనే విషయంలో కొన్ని ఆంక్షల్ని సడలించింది. పెళ్లికాని వారు కూడా చట్టబద్ధంగా పిల్లల్ని కనొచ్చని, వివాహితులు పొందే ప్రయోజనాలు పొందడానికి ఆ ప్రావిన్స్ అనుమతించనున్నట్లు ఓ ఇంటర్నేషనల్ మీడియా చెప్పుకొచ్చింది. ఇంతకుముందు ఉన్న నిబంధన ప్రకారం పెళ్లి అయిన వారు మాత్రమే లీగల్‌గా పిల్లలకు జన్మనివ్వడానికి అనుమతి ఉంది. కానీ, ఇప్పుడు ఆ నిబంధన సడలించనున్నారని తెలిపింది.
Emirates Flight: 13 గంటలు గాల్లో ప్రయాణించిన విమానం.. మళ్లీ టేకాఫ్ అయిన చోటుకే!
పెళ్లి కాని సింగిల్ పర్సన్ పిల్లలు కావాలనుకుంటే ఆ నిబంధన కింద ఫిబ్రవరి 15 నుంచి అనుమతి లభిస్తుంది. అందుకు సిచువాన్ అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంతమంది పిల్లల్ని కనాలనే సంఖ్య విషయంలో కూడా ఎలాంటి పరిమితి ఉండబోదట. దీర్ఘకాలిక, సమతుల్యతతో కూడిన పాపులేషన్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని సిచువాన్ ఆరోగ్య కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకూ ఇద్దరు పిల్లలు కావాలనుకున్న పెళ్లైన జంట మాత్రమే కమిషన్ వద్ద రిజిస్టర్ చేసుకునేందుకు అనుమతి ఉంది. కానీ, ఇప్పుడు వారితో పాటు పెళ్లికాని వారికీ ఈ వెసులుబాటు లభించింది.
దాదాపు 60ఏళ్ల తర్వాత తొలిసారి చైనా జనాభాలో తగ్గుముఖం కనిపిస్తోంది. మరణాల కంటే జననాల రేటు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఓల్డ్ ఏజ్ వారి సంఖ్య పెరగడం, జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో తాజా గణాంకాలు అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాంతో ఈ తరహా వెసులుబాట్ల వైపు అక్కడి ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి. పెళ్లయిన వారికి ఇచ్చే ప్రయోజనాలను వీరికి అందించేందుకు ముందుకు వస్తున్నాయి.
Nitin Gadkari: 9 లక్షల ప్రభుత్వ వాహనాలు తుక్కుకు: నితిన్ గడ్కరీ