ఓ ఫ్లైట్ టేకాఫ్ అయింది. 13 గంటలు డెస్టినేషన్ సిటీ వైపు ప్రయాణించింది. అంతలోనే మళ్లీ యూటర్న్ తీసుకుని టేకాఫ్ అయిన చోటుకే చేరుకుంది. దీంతో ఈ అనూహ్య సంఘటన చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు. అసలేం జరిగిందంటే.. దుబాయ్ నుంచి ఈకే448 విమానం ఉదయం 10.30 గంటలకు టేకాఫ్ అయింది. 9 వేల మైళ్ల ట్రిప్పులో ఆ విమానం సగం దూరం వెళ్లిన తర్వాత పైలట్ యూటర్న్ తీసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి తర్వాత మళ్లీ ఆ ఫ్లైట్ దుబాయ్‌లోనే ల్యాండ్ అయింది. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ ఎయిర్‌పోర్టులో వరదలు పోటెత్తడంతో అక్కడి ఎయిర్‌పోర్టును మూసేశారు. ఫలితంగా దుబాయ్ నుంచి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం వెనక్కి రాక తప్పలేదు.
Mickey Arthur: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆ జట్టుకు ఆన్‌లైన్ కోచ్!
ఇది ప్రయాణికులతో పాటు మాకు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. కానీ, ప్యాసింజర్ల భద్రత తమకు ప్రధానమని వివరించారు. తమ ఇంటర్నేషనల్ టర్మినల్‌కు జరిగిన నష్టాన్ని అధికారులు ఇప్పుడే అంచనా వేస్తున్నారని తెలిపారు. ఇది చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ.. ప్రయాణికుల భద్రతమే తమకు ముఖ్యమని పునరుద్ఘాటించారు. ఆదివారం అంటే జనవరి 29వ తేదీన ఉదయం 7 గంటల వరకు ఆక్లాండ్ ఎయిర్‌పోర్టులో ఇంటర్నేషనల్ ప్రయాణికులను అనుమతించలేమని పేర్కొన్నారు. దీంతో కొందరు ప్రయాణికులు తాము సురక్షితమే అని సంతోషం వ్యక్తం చేస్తుండగా ఇంకొందరు మాత్రం టైమ్ వేస్ట్ అయిందని అభిప్రాయపడ్డారు.
Adani FPO: ఇప్పుడున్న పరిస్థితుల్లో అదానీ ‘ఆఫర్’ సక్సెస్ అవుతుందా?