Hyderabad: గొంతులో కొబ్బరి ముక్క ఇరుక్కోని చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ జిల్లాలో ఓ విషాద ఘటన నెలకొంది. ఉదయం నుంచి ఎంతో ఉల్లాసంగా ఆడుకున్న ఓ బాలుడు ఉన్నట్టుండి విగతజీవిగా మారిపోయాడు. మృత్యువు ఏ క్షణంలో వస్తుందో ఊహించటం కష్టం కానీ.. మరీ ఈ చిన్నారి విషయంలో జరిగిన ఘటన మాత్రం గుండె తరుక్కుపోయేలా ఉంది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోనియా గాంధీనగర్‌లో నివాసముంటున్న 3 సంవత్సరాల జశ్వంత్ అనే బాలుడు ఉదయం నుంచి ఉత్సాహంగా ఆడుకున్నాడు.. అయితే.. తొలి ఏకాదశి కావటంతో.. సాయంత్రం చిన్నారిని తీసుకుని కుటుంబసభ్యులు గుడికి వెళ్లారు.. గుళ్లో పెట్టే ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా తీసుకున్న ఆ బాలుడికి.. ఆ ప్రసాదమే తన ప్రాణం తీస్తుందని తెలియదు.
Read Also: Mexico Heatwave: మెక్సికోలో భానుడి భగభగలు.. హీట్ స్ట్రోక్‌తో 100 మందికి పైగా మృతి
Also Read
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
- Arnab Cyclone Alert: దూసుకొస్తున్న 'అర్నబ్'.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
- OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
- Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
అయితే.. గుళ్లో కొబ్బరికాయ కొట్టగా.. అందులోని ఓ ముక్కను తీసి ప్రసాదంగా ఆ చిన్నారికి ఇచ్చారు. దీంతో ఆ బాబు కొబ్బరిని తీనగా.. అది కాస్తా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో.. చిన్నారికి ఊపిరాడక విలవిల లాడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని హాస్పటల్‌కు తరలించారు. కానీ.. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆ చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఆ కొబ్బరి ముక్క.. ఆ బొందిలోని ఊపిరిని ఆపేసింది.. ఆస్పత్రికి వెళ్లగానే పరీక్షించిన వైద్యులు.. బాలుడు మృతి చెందినట్లుగా నిర్ధారించారు.
Read Also: Monsoon Food Tips: వర్షాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకొవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం!
అప్పటి వరకు ఎంతో హుషారుగా ఆడుకున్న బాలుడు.. క్షణాల్లోనే విగతజీవిగా మారటాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మరణంతో ఆ ఏరియాలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో.. మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఊహించలేమని మరోసారి నిరూపితమైంది.
తాజావార్తలు
-
Srinidhi Shetty: “త్రివిక్రమ్’ని జీవితాంతం వదలను.. అలా విసిగిస్తూనే ఉంటా!”
-
Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
-
Flights Cancelled : తుఫాన్ దెబ్బ.. విజయవాడలో ఇండిగో విమానాలన్నీ రద్దు.!
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!