NTV Telugu Site icon

Champions Trophy 2025: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్..

Fakhar Zaman

Fakhar Zaman

సొంతగడ్డపై జరుగుతున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు మంచి ఆరంభం లభించలేదు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌ జట్టు 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవి చూసింది. మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో బిగ్ షాక్‌ తగిలింది. బ్యాటర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఆదివారం భారత్‌తో జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం దుబాయ్ వెళ్లలేదు. ఫఖర్‌కు చాతీ కండరాల నొప్పి రావడంతో ఈ మ్యాచ్‌లో ఆడలేకపోతున్నాడు. అతని స్థానంలో ఇమామ్-ఉల్-హక్‌ను జట్టులోకి తీసుకున్నారు.

Read Also: Aadi Srinivas : బీఆర్‌ఎస్‌ పార్టీ బరితెగించి ముందుకు పోతుంది

న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. చాలా సమయం ఆయన ఫీల్డింగ్ చేయలేదు. అయినప్పటికీ.. 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ చేసిన ఫఖర్ 41 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మరోవైపు.. పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ సామ్ అయూబ్ కూడా ఈ ట్రోఫీ ఆడటం లేదు. దీంతో, పాకిస్తాన్ జట్టు ఇద్దరు ప్రధాన ఆటగాళ్లను కోల్పోయింది. పాకిస్తాన్ జట్టుకు గాయాలు పెద్ద సమస్యగా మారాయి.

Read Also: Cockroach in Mutton Soup : మటన్‌ సూప్‌ ఆర్డర్ చేస్తే.. బొద్దింక సూప్‌ వచ్చిందేంటీ..?

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆ సమయంలో ఫఖర్ జమాన్ భారత్ ను ఓడించి పాకిస్తాన్ జట్టుకు టైటిల్ గెలిపించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఫఖర్ 106 బంతుల్లో 114 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ ఆధారంగా పాకిస్తాన్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ కు ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫఖర్ జమాన్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పాకిస్తాన్ జట్టుకు టైటిల్ గెలుచుకుంది. అయితే.. ఇప్పుడు అతనికి గాయం కారణంగా పాకిస్తాన్ జట్టు ఆందోళనలో ఉంది.