సొంతగడ్డపై జరుగుతున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు మంచి ఆరంభం లభించలేదు. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టు 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవి చూసింది. మొదటి మ్యాచ్‌లోనే ఓడిపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. బ్యాటర్ ఫఖర్ జమాన్ గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.