ప్రేమకు కులాలు, మతాలు, పెద్ద, చిన్న అనే బేధం లేదు. వృద్ధులతో కూడా ప్రేమలో పడి తమ జీవిత భాగస్వాములుగా చేసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఓ జంట గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వయస్సు గురించా కులం, మతం గురించా కాదు. ఎత్తు కారణంగా చర్చనీయాంశమవుతున్నారు. సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల కంటే ఎక్కువ ఎత్తు ఉంటారని మనకు తెలిసిన విషయమే.. కానీ ఈ జంట మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ అమ్మాయి ఎత్తు ఎక్కువ, అబ్బాయిది తక్కువ. వారి మధ్య ఎత్తులో ఒక అడుగు వ్యత్యాసం ఉంది. ఆ జంట బ్రిటన్ కు చెందినవారు.
ఓ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. అబ్బాయి పేరు జేమ్స్.. అతని వయస్సు 30 సంవత్సరాలు ఉంది. అమ్మాయి పేరు లిజ్జీ జేడ్ గ్రూమ్‌బ్రిడ్జ్.. ఆమె వయస్సు 29 సంవత్సరాలు. జేమ్స్ ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు ఉండగా.. లిజీ 6 అడుగుల 3 అంగుళాలు ఉంది. ఆమే తన 16 ఏళ్ల వయసులో 6 అడుగుల ఎత్తు ఉండేదని చెప్పింది. ఆ సమయంలో ఆమెను జనాలు చాలా వింతగా చూసేవారని తెలిపింది. అంతేకాకుండా ఆమే వయస్సు ఉన్న అమ్మాయిలు ఎత్తులో తన కంటే చాలా చిన్నగా ఉండేదని.. అందుకే తనను ఓ టైప్ లో చూసేదంటూ చెప్పుకొచ్చింది.
Governor Tamili sai: పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు..!
అయితే ఇప్పుడు లిజీ.. తన ఎత్తు విషయంలో ఎవరేమీ కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా తన పనులు తాను చేసుకుంటూ వెళ్తుంది. అంతేకాకుండా తన బాయ్‌ఫ్రెండ్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెబుతుంది. మరోవైపు సోషల్ మీడియాలో తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫోటోలు దిగి షేర్ చేసినప్పుడు.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారని తెలిపింది. కానీ ఆ కామెంట్స్, ట్రోల్స్ ను పట్టించుకోనని.. తన ప్రియుడితో కలిసి హ్యాపీ లైఫ్ గడుపుతున్నట్లు లిజీ చెబుతుంది.