90 Year Old Groom: 90 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లి చేసుకున్న ఓ తాతయ్య.. పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం అంటున్నాడు.. ఐదో పెళ్లి తర్వత హనీమూన్‌లో ఉన్న ఆయన ఈ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.. అంతే కాదండోయ్.. ఇక్కడితో ఆగేది లేది.. మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటాను అంటున్నాడు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ తాతయ్య వ్యవహారానికి వస్తే.. సౌదీ అరేబియాలో, ఒక వృద్ధుడి ఐదో పెళ్లి గురించి సోషల్ మీడియా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.. అది స్థానిక మీడియాకు చేరడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.. ఐదో పెళ్లి చేసుకుని హనీమూన్ జరుపుకుంటున్నాడు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువత.. తమ మతాన్ని కాపాడుకోవడానికి పెళ్లి చేసుకోక తప్పదని సూచించాడు.
ఈ 90 ఏళ్ల వృద్ధుడు తన ఐదవ వివాహంతో సౌదీ అరేబియాలో అత్యంత వయస్సు కలిగిన వరుడు అయ్యాడు. వృద్ధుడు తన ఐదవ భార్యతో హనీమూన్‌లో ఉన్నాడు మరియు భవిష్యత్తులో మరిన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. గల్ఫ్ న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం, నాదిర్ బిన్ దహీమ్ వహక్ అల్ ముర్షిది అల్ ఒతైబి తన ఐదవ వివాహాన్ని సౌదీలోని అఫీఫ్ ప్రావిన్స్‌లో జరుపుకున్నాడు. వృద్ధుడి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. అందులో అతనికి ఐదో పెళ్లి తర్వాత బంధువులు, స్నేహితులు అభినందనలు తెలుపుతున్నారు. వీడియోలో, వృద్ధుడు సంతోషంగా కనిపిస్తున్నాడు.. ఇక, తన వివాహం గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. వీడియోలో, అతని మనవడు ఒకరు.. తాతగారికి అభినందనలు, నేను మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని చెబుతున్నాడు.
ఇక, దుబాయ్‌కి చెందిన అరేబియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌదీ వృద్ధ వరుడు.. పెళ్లిపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. ఆ వ్యక్తి వివాహాన్ని సున్నత్ (ఇస్లాంలో ప్రవక్త మొహమ్మద్ సూచించిన సంప్రదాయాలు మరియు పద్ధతులు)గా అభివర్ణించాడు. నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను! వైవాహిక జీవితం అనేది సర్వశక్తిమంతుడు, లోకాలకు ప్రభువు ముందు విశ్వాసం మరియు గర్వానికి మూలం. ఇది సుఖాన్ని, శ్రేయస్సును తెస్తుంది. అంతే కాదు నా మంచి ఆరోగ్యానికి రహస్యం. పెళ్లికాని వారు పెళ్లి చేసుకోవాలని కూడా చెప్పుకొచ్చాడు.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యువత.. తమ మతాన్ని కాపాడుకోవడానికి పెళ్లి చేసుకోక తప్పదని తెలిపాడు.. ఐదో పెళ్లితో ఆగేది లేదు.. మరిన్ని పెళ్లిళ్లు చేసుకుంటాను అంటూ ఈ 90 ఏళ్ల వృద్ధుడు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. నా పిల్లలకు ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నేను ఇంకా పిల్లలను కనాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు తాతయ్య.
پانچویں مرتبہ ہنی مون منانے والے نوے سالہ سعودی دلہا میاں کے کنوارے نوجوانوں کو سنہری مشورے!https://t.co/laYvvZpxUy pic.twitter.com/rGGm4FDVbD
— العربیہ اردو (@AlArabiya_Ur) July 13, 2023