శ్రీలంక నుంచి ఇండియాకు ఈత కొడుతున్న 78 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. బెంగళూరుకు చెందిన 78 ఏళ్ల గోపాల్‌రావు అనే వృద్ధుడు శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోడికి ఈత కొడుతుండగా గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. అర్ధరాత్రి కొంత మంది బృందం ఈత ఈవెంట్‌ను ప్రారంభించారు. శ్రీలంక నుంచి ఇండియాకు వస్తుండగా గోపాల్‌రావు అసౌకర్యానికి గురయ్యాడు. ఛాతీ నొప్పితో బాధపడుతుండగా.. అతనితో పాటు ఉన్న ఈతగాళ్లు వెంటనే పడవలోకి ఎక్కించారు. అనంతరం వైద్యుడ్ని సంప్రదించారు. కానీ అతని ప్రాణం నిలువలేదు. గుండెపోటుతో తుది శ్వాస విడిచాడు.
ఇది కూడా చదవండి: Kakarla Suresh: ఉదయగిరి కోటపై టీడీపీ జెండా ఎగరవేస్తా.. ఉదయగిరిని సిరులగిరిగా చేస్తా
ఈతగాళ్లంతా రిలే స్విమ్మింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు. శ్రీలంక నుంచి పాక్ జలసంధి మీదుగా భారతదేశానికి రిలే స్విమ్మింగ్ ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ ఈతగాళ్ల బృందంలో గోపాల్‌రావు కూడా పాల్గొన్నాడు. ఈవెంట్ సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. సహచరులు స్పందించి డాక్టర్ దగ్గర తీసుకెళ్లేలోపే అతడు మృతిచెందాడు. మృతుడు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన సెప్టాజెనరియన్ స్విమ్మర్ గోపాల్ రావుగా గుర్తించారు. మంగళవారం శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని రామేశ్వరంలోని ధనుష్కోడి ద్వీపానికి స్విమ్మింగ్ చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Jai Hanuman : ఐమ్యాక్స్ 3డీ వెర్షన్ లో జై హనుమాన్… లేటెస్ట్ పోస్టర్ వైరల్..
ఏప్రిల్ 22 న రామేశ్వరం నుంచి పడవలో బయలుదేరి.. ఏప్రిల్ 23 తెల్లవారుజామున 12:10 గంటలకు శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి ధనుష్కోడి వైపు ఈత ప్రయాణాన్ని ప్రారంభించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఛాతీ నొప్పితో గోపాల్‌రావు ఇబ్బందిపడ్డాడు. వెంటనే అతనిని పడవలోకి ఎక్కించారు. వైద్య సహాయం అందుబాటులో ఉన్నప్పటికీ.. దురదృష్టవశాత్తు అప్పటికే అతడు ప్రాణాలు విడిచినట్లు వైద్యుడు ప్రకటించారు. అనంతరం స్విమ్మర్‌లంతా రిలే ఈవెంట్‌ను రద్దు చేసి పడవలో ధనుష్కోడి ద్వీపానికి తిరిగి వచ్చారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు రెండు దేశాల నుంచి అనుమతి పొందినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kavya Kalyan Ram : బలగం బ్యూటీ కొత్త స్టిల్స్ అదుర్స్..
