NTV Telugu Site icon

Road Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం.. బస్సు-ట్రక్కు ఢీ, ఐదుగురు దుర్మరణం

Thamilnadu

Thamilnadu

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఢీకొన్న ఘటనలో రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు నుజ్జునుజ్జు అయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదం సేలంలో జరిగింది. కాగా.. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.

Read Also: International Yoga Day 2024: ఎత్తు పెరగాలంటే ఈ మూడు ఆసనాలు ట్రై చేయండి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు ఓ ట్రక్కు వెనుక రెండు బైక్‌లపై ప్రయాణిస్తున్నారు. మృతుల్లో ఒకరైన లక్ష్మణన్‌ తన భార్య, బిడ్డతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మురుగన్ అనే మరో వ్యక్తి తన భార్య, 11 నెలల కొడుకుతో బైక్ పై వెళ్తున్నాడు. అయితే ముందు స్పీడ్ బ్రేకర్ రాగానే.. లారీ డ్రైవర్ ఒక్కసారిగా వేగాన్ని తగ్గించాడు. బైకర్లు కూడా లారీ వేగం తగ్గించడం చూసి.. వారు వేగం తగ్గించారు. అయితే వెనుకాల వస్తున్న ప్రైవేట్ బస్సు వారిని వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

Read Also: Tragedy : కాంపౌండ్ వాల్ కూలి ముగ్గురు కూలీలు మృతి

ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను తమిళనాడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి డ్రైవర్ రమేష్ పరారీలో ఉన్నాడు. మరోవైపు.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తన సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పగాయాలైన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు.