జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చోసిటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 160 మంది గాయపడ్డారు. 220 మందికి పైగా ఇప్పటికీ కనిపించడం లేదు. మృతుల్లో ఇద్దరు CISF జవాన్లు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అమిత్ షాకు పరిస్థితి గురించి తెలియజేశారు. శిథిలాల కింద లేదా ప్రమాదంలో చిక్కుకున్న ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి సహాయ సిబ్బంది గంటల తరబడి కష్టపడి పనిచేస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కానీ, వర్షం, బురద సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతున్నాయి.
Also Read:Off The Record: ఆ జనసేన ఎమ్మెల్యే ఎందుకు గెలిచినా అని ఫీల్ అవుతున్నారా?
క్లౌడ్ బరస్ట్ తరువాత, తీవ్రమైన వరదలు విధ్వంసం సృష్టించాయి. విపత్తు జరిగిన ప్రదేశానికి సమీపంలో మృతదేహాలు పడి ఉన్నాయి. సైన్యం, పోలీసులు, స్థానిక ప్రజలు గాయపడిన వారిని బురదలోంచి తమ భుజాలపై మోసుకెళ్లి ఆసుపత్రికి తరలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో బిజెపి నాయకుడు మరియు ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ చోసిటిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. మచైల్ యాత్ర బేస్ క్యాంప్ అయిన చోసిటి చుట్టూ మృత్యువు విలయతాండవం చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
