Nun Dead Body Intact: ఎవరైయినా చనిపోతే ఏమీ చేస్తారు.. వారిని వారి ఆచారాల మేరకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. చనిపోయిన తరువాత ఖననం చేస్తే కొద్ది రోజుల్లో అస్థిపంజరాలు మిగులుతాయి. అలా కాకుండా ఖననం చేయకుండా చనిపోయిన వారి మృతదేశాన్ని అలాగే కొద్ది కాలం ఉంచాలనుకుంటే కొన్ని రసాయనాలను వినియోగిస్తారు. కానీ ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ఖననం చేస్తే.. అస్థిపంజరమే మిగులుతుంది. కానీ అమెరికాలోని మిస్సౌరీలో నాలుగేళ్ల క్రితం మరణించిన ఓ క్రైస్తవ సన్యాసిని మృతదేహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా మరణించిన సమయంలో ఎలా ఉందో.. నాలుగేళ్ల తరువాత కూడా అలానే ఉంది. ఇదెలా సాధ్యమయిందని.. మృతదేహాన్ని చూడటానికి ప్రజలు తరలి వస్తున్నారు.
అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. అమెరికా గోవెర్ పట్టణంలో క్యాథలిక్ సన్యాసిని సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ 95 ఏళ్ల వయస్సులో 2019 మే 29న మరణించారు. దీంతో ఆమె మృతదేహాన్ని చెక్క శవపేటికలో ఉంచి క్రైస్తవ మత ఆచారాల ప్రకారం ఖననం చేశారు. నాలుగేళ్ల కిందట ఖననం చేసిన క్రైస్తవ సన్యాసిని మృతదేహం ఇప్పటికీ చెక్కుచెదరకపోగా.. కుళ్లిన సంకేతాలు కూడా కనిపించకపోవడం గమనార్హం. దీంతో దానిని చూసేందుకు క్రైస్తవ సన్యాసినులు, ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అమెరికాలోని మిస్సౌరీలో ఈ అద్భుతం వెలుగుచూసింది. సిస్టర్ విల్హెల్మినా 1995లో బెనెడిక్టైన్స్ ఆఫ్ మేరీ, క్వీన్ ఆఫ్ అపోస్టల్స్ ఆర్డర్‌ను స్థాపించినట్టు ది కాన్సాస్ సిటీ డియోసిస్ సెయింట్ జోసెఫ్ వెల్లడించింది. కాగా, మత ఆచారం ప్రకారం ప్రార్థనా మందిరంలోని బలిపీఠం కిందకు మృతదేహా అవశేషాలను తరలించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మే 18న ఖననం చేసిన ప్రదేశంలో శవపేటికను వెలికి తీశారు. లోపలి ఉన్న భౌతికకాయం కనీసం చెక్కుచెదరకపోవడంతో ఆశ్చర్యపోయారు.
ఆమె నెక్‌కు ధరించే బెల్ట్ మాదిరి క్లాత్, తలకు ధరించిన క్లాత్ మాత్రమే పాడైయినట్టు ఆశ్రమ నిర్వహకులు తెలిపారు. నెలల తరబడి ఆమె శరీరం పాక్షికంగా పాడైన చెక్క శవపేటికలో ఉండి.. సూర్యరశ్మీ, వర్షాలకు ఎక్స్‌పోజ్ అయినా ఏ మాత్రం కుళ్లకుండా అలా ఉండటం అత్యంత విచిత్రం అని బంధువుల అంటున్నారు.ఆమె మృతదేహాన్ని మరోచోటికి తరలించి సమాధి చేయనున్నట్టు వారు తెలిపారు. ఆమె తల్లి సిసిలియా మాట్లాడుతూ ఇది దేవుడి పట్ల ఆమెకు ఉన్న భక్తి విశ్వాసం, నిస్వార్థపూరిత సేవకు భగవంతుడు ఇచ్చిన వరం కాబోలని అన్నారు.