Drones: పంజాబ్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం..మూడింటిని కూల్చేసిన జవాన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drones: ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఉగ్రచర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలొస్తున్నాయ్. కారణం నిత్యం దేశ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా పాక్ డ్రోన్లు దేశంలోకి ప్రవేశిస్తుండడం కలవర పెడుతోంది. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి డ్రోన్ల కలకలం రేగింది. సరిహద్దు వెంబడి 4పాకిస్తాన్ డ్రోన్‌లను అడ్డగించి.. వాటిలో మూడింటిని దేశ భద్రతా బలగాలు కూల్చివేశాయి. శుక్రవారం రాత్రి అమృత్‌సర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్‌కు చెందిన మూడు డ్రోన్లు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. అయితే గుర్తించిన బీఎస్‌ఎఫ్ జవాన్లు వెంటనే అప్రమత్తమై.. వాటిపై కాల్పులు జరిపి నేలకూల్చారు. మరో డ్రోన్ ను శనివారం రాత్రి కూల్చివేశారు. వాటిలో ఒకదాంట్లో అనుమానాస్పద మత్తు పదార్థాలు ఉన్న బ్యాగ్‌ని స్వాధీనం చేసుకున్నారు.
Read Also:Mallikarjun Kharge : ప్రధాని జపాన్ పోయినప్పుడల్లా నోట్ల రద్దు.. అదేందో మరి
Also Read
మరో డ్రోన్ డీజేఐ మ్యాట్రిస్ 300 ఆర్టీకే పేరుతో ఉన్న బ్లాక్ క్వాడ్‌కాప్టర్ ఉంది. దీనిని అమృత్‌సర్ జిల్లాలోని ఉదర్ ధరివాల్ గ్రామంలో భద్రతా బలగాలు కూల్చివేశాయి. డ్రోన్ ను కూల్చివేసి, స్వాధీనం చేసుకున్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బీఎస్ఎఫ్ సిబ్బంది మానవరహిత వైమానిక వాహనాన్ని కాల్పులు జరిపి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. మరో డ్రోన్‌కు రతన్ ఖుర్ద్ గ్రామంలో స్వాధీనం చేసుకున్నామని, దానికి 2.6 కిలోల రెండు హెరాయిన్ ప్యాకెట్లను గుర్తించామని తెలిపారు. శుక్రవారం రాత్రి ఈ ఫ్రంట్‌లో మూడో డ్రోన్‌ని అడ్డుకున్నారు. అయితే అది పాక్‌వైపు తిరిగి వెళ్లిపోయింది. పాకిస్తాన్ వైపు నుండి కొంతమంది మూడవ డ్రోన్‌ను ఎత్తినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించిందని ప్రతినిధి చెప్పారు.
Read Also:Tollywood Anchors: మాల్దీవుల్లో వెకేషన్స్.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పాపలు
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!