Site icon NTV Telugu

Road Accident: కారు – ట్రక్కు ఢీ.. నలుగురు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం..

Accident

Accident

Road Accident: ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా ఎర్టిగా కారులో ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణించే కారు దారిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. లారీని ఢీకొట్టడంతో పేద్దగా కేకలు వినిపించాయి. కారు వచ్చిన వేగానికి ఒక్కసారిగా చెల్లచెదురుగా మారింది. కారు భాగాలను కోసి మృతదేహాలను బయటకు తీశారు అధికారులు.

G. Kishan Reddy: వ్యక్తులు, కుటుంబం కోసం కాదు.. దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ..

ఎటావాలోని ఇక్డిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 19పై ఉదయం 7 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఆగ్రా కాన్పూర్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఎర్టిగా ఢీకొట్టింది. ఢీకొనడంతో కారులో ఉన్న ఏడుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహిళ, బాలికను జిల్లా ఆస్పత్రి నుంచి సైఫాయి మెడికల్ కాలేజీకి తరలించారు. మాట్లాడగలిగే జితేంద్ర అనే పిల్లాడు మేం తన తల్లి ఇంటికి వెళ్తున్నామని చెప్పాడు. మా చెల్లి, మా అమ్మ గాయపడ్డారు. మేమంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. సగం కుటుంబం చనిపోయిందని తెలిపాడు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉంది. రెస్క్యూ టీమ్ వాహనాన్ని కట్ చేసి మృతుల మృతదేహాలను బయటకు తీశారు. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు.

Pongal Release : 2025 సంక్రాంతి ఇప్పటికే హౌస్ ఫుల్.. రేస్ లోకి మరో స్టార్ హీరో..

ఈ విషయమై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామ్ చౌదరి మాట్లాడుతూ ఇక్డిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్ఖర్ ఎదురుగా నాలుగు చక్రాల వాహనం, ట్రక్కు ఢీకొన్నట్లు తెలిపారు. ఓ చిన్నారి, బాలిక, పూనమ్ అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన నలుగురి మృతదేహాలు మార్చురీలో భద్రపరిచారు.

Exit mobile version