Road Accident: ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందినవారు. వీరంతా ఎర్టిగా కారులో ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణించే కారు దారిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. లారీని ఢీకొట్టడంతో పేద్దగా కేకలు వినిపించాయి. కారు వచ్చిన వేగానికి ఒక్కసారిగా చెల్లచెదురుగా మారింది. కారు భాగాలను కోసి మృతదేహాలను బయటకు తీశారు…