CM Revanth Reddy: నేడు జగిత్యాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కోరుట్ల, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఉదయం 11 గంటలకు కోరుట్ల శివారులో జరగనున్న కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో సీఎం పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు కూకట్ పల్లి కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు శేరిలింగంపల్లి కార్నర్ మీటింగ్ కు సీఎం హాజరుకానున్నారు.
Read also: Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్రమంత్రి.. రాత్రికి హైదరాబాద్‌లోనే బస..
భూపాలపల్లి జిల్లా రేగొండ జన జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గ్రామాన్ని కెసిఅర్ ప్రభుత్వం చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రెవెన్యూ గ్రామము చేసి మన చిత్త శుద్దిని చాటుకున్నామన్నారు. సెమీ ఫైనల్ లో ఆరోజు కేసీఆర్‌ను ఓడించి బుద్ధి చెప్పామని, ఈ ఫైనల్ లో గుజరాత్ నుండి వచ్చిన మోడీ నీ ఒడగొట్టాలన్నారు. ఈ గడ్డ పైనా గుజరాత్ పెత్తనం ఏంటి అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కు చేయాల్సిన అన్యాయం చేశారని, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చాడా అని ఆయన అన్నారు.
Read also: Madhyapradesh : త్రిపుల్ రైడ్ బుల్లెట్ ఆపాలన్న కానిస్టేబుల్.. వీరంగం సృష్టించిన యువకులు
బీజేపీకి నాలుగు వందల సీట్లు కావాలి.. ఇవి ఎందు కంటే రిజర్వేషన్లు ను ఎత్తే సేందుకే ఈ సీట్లు అడుగుతున్నారు బీజేపీ నేతలు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏస్ సి ..ఏస్టి కి రిజర్వేషన్లు ఇచ్చి వారి అభివృద్ధి కి సహకరించింది.. ఓబీసి కూడా రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, బీసీ రిజర్వేషన్ లు పెంచాలని మేము అంటుంటే అగ్ర వర్ణాల కోసం ఈ రిజర్వేషన్లను ఎత్తేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. బడుగు బలహీనర్గాలకు రిజర్వేషన్లు కోసం నేను అడుగుతుంటే. డిల్లి నుండి బిజెపి వాళ్ళు నాకు నోటీసులు ఇచ్చారని, కేసులకు రేవంత్ రెడ్డి భయపడుతారా అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘కేసీఆర్ తప్పుడు కేసులతో నన్ను జైల్ లో పెడితే ప్రజలు బుద్ధి చెప్పారు. అదే స్ఫూర్తి తో మోడీకి కూడా బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.
T20 World Cup 2024: రింకూ సింగ్‌కు అవకాశం రాకపోవడానికి కారణం అతడే?