NTV Telugu Site icon

Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు.. సురక్షితంగా బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్

Bihar

Bihar

Child Fell Into Borewell in Bihar: బీహార్‌ నలందా జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారిని ఎన్‌డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయి.వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు.శివమ్ అనే బాలుడిని రక్షించడానికి ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని దాదాపు 5 గంటల పాటు శ్రమించి కాపాడారు. “ఒక బాలుడు బోరుబావిలో పడిపోయినట్లు మాకు సమాచారం అందింది. ఆ బాలుడిని రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నించాం. ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. పిల్లవాడు బతికే ఉన్నాడు, అతని అరుపులు వినిపిస్తున్నాయి.” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

Also Read: CM KCR: మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం.. కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ

ఆ బాలుడి తల్లి పొలంలో పనిచేస్తుండగా.. ఆ బాలుడు బోరుబావి పక్కనే ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ వెళ్లి కాలుజారి బోరుబావిలో పడిపోయాడని బాలుడి తల్లి వెల్లడించింది. బోరుబావిలోకి ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. బాలుడు 40 అడుగుల లోతులో ఇరుక్కున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ రైతు బోరు వేశాడని.. అందులో నీరు రాకపోవడంతో బోరును పూడ్చకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. చిన్నారిని బయటకు తీస్తే తక్షణ వైద్య సహాయం అందించడానికి ఆక్సిజన్ సౌకర్యాలతో కూడిన వైద్య బృందాలు కూడా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఓ రైతు నీళ్ల కోసం ఇక్కడ బోరుబావి తవ్వేందుకు యత్నించగా.. విజయవంతం కాలేదు. దీంతో వేరే ప్రాంతంలో మరో బోరుబావి తవ్వించాడని ఓ సీనియర్ అధికారి చెప్పారు. నీళ్లు పడకపోవడం వల్ల దానిని పూడ్చకుండా అలాగే వదిలేశాడు.

Also Read: Weather Update: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని ఒక గ్రామంలో బోరు బావిలో చిన్నారి పడింది. ఆ చిన్నారి బయటకు తీసేలోపే మరణించింది. జూన్ 6న మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడి రెండున్నరేళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.