Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు.. సురక్షితంగా బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Fell Into Borewell in Bihar: బీహార్ నలందా జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారిని ఎన్‌డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయి.వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు.శివమ్ అనే బాలుడిని రక్షించడానికి ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని దాదాపు 5 గంటల పాటు శ్రమించి కాపాడారు. “ఒక బాలుడు బోరుబావిలో పడిపోయినట్లు మాకు సమాచారం అందింది. ఆ బాలుడిని రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నించాం. ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుంది. పిల్లవాడు బతికే ఉన్నాడు, అతని అరుపులు వినిపిస్తున్నాయి.” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
Also Read: CM KCR: మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం.. కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ఆ బాలుడి తల్లి పొలంలో పనిచేస్తుండగా.. ఆ బాలుడు బోరుబావి పక్కనే ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ వెళ్లి కాలుజారి బోరుబావిలో పడిపోయాడని బాలుడి తల్లి వెల్లడించింది. బోరుబావిలోకి ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. బాలుడు 40 అడుగుల లోతులో ఇరుక్కున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ రైతు బోరు వేశాడని.. అందులో నీరు రాకపోవడంతో బోరును పూడ్చకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. చిన్నారిని బయటకు తీస్తే తక్షణ వైద్య సహాయం అందించడానికి ఆక్సిజన్ సౌకర్యాలతో కూడిన వైద్య బృందాలు కూడా ఉన్నాయని ఓ అధికారి చెప్పారు. ఓ రైతు నీళ్ల కోసం ఇక్కడ బోరుబావి తవ్వేందుకు యత్నించగా.. విజయవంతం కాలేదు. దీంతో వేరే ప్రాంతంలో మరో బోరుబావి తవ్వించాడని ఓ సీనియర్ అధికారి చెప్పారు. నీళ్లు పడకపోవడం వల్ల దానిని పూడ్చకుండా అలాగే వదిలేశాడు.
Also Read: Weather Update: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని ఒక గ్రామంలో బోరు బావిలో చిన్నారి పడింది. ఆ చిన్నారి బయటకు తీసేలోపే మరణించింది. జూన్ 6న మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో 300 అడుగుల లోతున్న బోరుబావిలో పడి రెండున్నరేళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది.
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!