Kamareddy : ఈ మధ్య మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. డబ్బు మాయాలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రూపాయి మనిషి రూపాన్నే మార్చి వేస్తుంది. అప్పటివరకు మనతో ఉన్న వాళ్లు కూడా మనీ కోసం వెన్నుపోటు పొడుస్తున్నారు. అలాంటి ఘటనే కామారెడ్డిలో చోటు చేసుకుంది. నారయణ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మహేశ్వరి అనే మహిళతో నారాయణ సహజీవనం చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే వారిద్దరికీ ఆరు వేల రూపాయల విషయంలో గొడవ జరిగింది. తనకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని తగువు పడ్డారు.
Read Also: Karnataka: కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ.. డీకేకు బర్త్‌డే గిఫ్ట్ వచ్చేనా?
దీంతో సహనం కోల్పోయిన నారాయణ.. మహేశ్వరి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన కామారెడ్డి వీక్లీ మార్కెట్ సమీపంలో చోటు చేసుకుంది. నారాయణ నిప్పు పెట్టిన సమయంలో మహేశ్వరి ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అతడు నిప్పు పెట్టి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని చితకబాదారు. దీంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నారాయణను చికిత్సి నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Read Also: Apara Ekadashi 2023 Special: అపర ఏకాదశి రోజున ఈ స్తోత్రాలు వింటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది