ఢిల్లీలో శనివారం వాతావరణం చల్లబడింది. ప్రతికూల వాతావరణం కారణంగా శనివారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో కనీసం 22 విమానాలను దారి మళ్లించారు. వాటిలో 9 విమానాలను జైపూర్‌కు, 8 లక్నోకు, 2 చండీగఢ్‌కు, వారణాసి, అమృత్‌సర్ మరియు అహ్మదాబాద్‌లకు ఒక్కో విమానాన్ని మళ్లించారు. ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రూట్‌లను మార్చిన విమానాలలో 9 ఇండిగో విమానాలు, 8 ఎయిర్ ఇండియా విమానాలు, 3 విస్తారా విమానాలు ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి…