Uttar Pradesh: సైకిల్‌ను తాకిందని.. ఐదేళ్ల బాలిక గొంతు కోసిన యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
21 years Old slits 5-year-old’s throat for touching bicycle in Uttar Pradesh: ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే మనుషుల ప్రాణాలను తీసేస్తున్నారు. మనిషి బతుకుకు విలువే లేకుండా పోతుంది. డబ్బులు కాజేశారని, పశువులను దొంగలించారని, అమ్మాయి కోసం అని, ఆఖరికి ఐదు రూపాయల దగ్గర కూడా ఒకరినొకరు చంపుకున్న ఘటనలు చూశాం. తాజాగా తన సైకిల్ పట్టుకుందని ఓ ఐదేళ్లను బాలికను గొంతుకోసి చంపాడు ఓ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి చిన్నపిల్లాడు కాదు. 21 ఏళ్ల యువకుడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నిచ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేధి గ్రామంలో జరిగింది. ఇది మంగళవారం నాడు జరిగింది.
Also Read: TomTom Traffic Index : ట్రాఫిక్ లోనే గడిచిపోతున్న జీవితం.. ఈ నగరాల్లో మరీ ఎక్కువ
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
వివరాల ప్రకారం ఐదేళ్ల మైనర్ బాలిక చ్లాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లేధి గ్రామంలో మంగళవారం నాడు తన స్నేహితులతో కలిసి ఓ తోటలో ఆడుకుంటుంది. ఇంతలో దీపక్ అనే 21 ఏళ్ల యువకుడు సైకిల్ వేసుకొని అక్కడికి వచ్చాడు. అయితే ఆ బాలిక ఆడుకుంటూ ఆ యువకుడి సైకిల్ ను తాకింది. దీంతో ఆ యువకుడికి కోపం వచ్చి నా సైకిల్ నే ముట్టుకుంటావా అంటూ ఆ బాలికతో ఘర్షణకు దిగాడు. అంతేకాకుండా ఆ బాలిక గొంతు కూడా కోశాడు. దీంతో ఐదేళ్ల చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. అక్కడికి చేరుకున్న స్థానికులు ఆ బాలికను కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే చనిపోయింది. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు స్థానికులు. అక్కడికి చేరుకున్న పోలీసులు దీపర్ ను అరెస్ట్ చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితులను విచారిస్తున్నామని, కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. తన సైకిల్‌ను తాకడంతో దీపక్ బాలిక గొంతు కోసి చంపాడని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) ఆతీష్ కుమార్ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!