నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ నేటి నుంచి అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో మొదలు కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆటను మరింత పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (IFAB) పలు కీలక నియమాలను అమల్లోకి తీసుక రానుంది. ఆటగాళ్ల ప్రవర్తన, ప్రత్యామ్నాయ ఆటగాళ్ల మార్పులు, VAR వినియోగం, సమయాన్ని వృథా చేయడం వంటి అంశాల్లో ఈ కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం..
Also Read
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
నోరు మూసుకోవడం:
మైదానంలో ప్రత్యర్థి ఆటగాడితో వాగ్వాదానికి దిగిన సమయంలో ఆటగాడు తన నోరును చేతితో, చేతి భాగంతో లేదా జెర్సీతో కప్పుకుంటే రెఫరీ నేరుగా రెడ్ కార్డు చూపించే అవకాశం ఉంటుంది. ఆటలో పారదర్శకత పెంచడం, ఆటగాళ్లు ఏమి మాట్లాడుతున్నారో దాచిపెట్టే ప్రయత్నాలను అరికట్టడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా ఫిఫా పేర్కొంది.
కొత్త ప్రత్యామ్నాయం:
సబ్స్టిట్యూషన్ నిబంధనల్లో కూడా కీలక మార్పులు జరిగాయి. మార్పిడి చేయబడే ఆటగాడు 10 సెకన్లలోపు మైదానాన్ని విడిచి వెళ్లాలి. అలాగే తనకు దగ్గరలో ఉన్న ఎగ్జిట్ పాయింట్ ద్వారానే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఆటగాడు కావాలనే ఆలస్యం చేస్తే, అతని స్థానంలో వచ్చే ఆటగాడిని వెంటనే మైదానంలోకి అనుమతించరు. తదుపరి ఆట నిలిచే వరకు ఆ జట్టు ఒక ఆటగాడు తక్కువగా ఆడాల్సి ఉంటుంది.
సమయం వృధా :
సమయాన్ని వృధా చేసే చర్యలపై కూడా ఫిఫా కఠిన వైఖరి అవలంబించింది. త్రో-ఇన్లు, కార్నర్ కిక్‌ల సమయంలో ఆటగాళ్లు కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు రెఫరీ భావిస్తే ఐదు సెకన్ల కౌంట్‌డౌన్ ప్రారంభిస్తారు. నిర్ణీత సమయంలో ఆటను పునఃప్రారంభించకపోతే బంతి స్వాధీనం ప్రత్యర్థి జట్టుకు ఇవ్వబడుతుంది.
పరిస్థితులను VAR సమీక్ష:
వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) పాత్రను కూడా మరింతగా పెంచారు. తప్పుగా కార్నర్ కిక్ ఇచ్చిన సందర్భాలు, ఆట పునఃప్రారంభానికి ముందు జరిగిన అటాకింగ్ ఫౌల్స్, స్పష్టంగా తప్పుగా చూపిన రెండో ఎల్లో కార్డులు, పొరపాటున తప్పు ఆటగాడిని శిక్షించిన సందర్భాల్లో VAR జోక్యం చేసుకునే అధికారం కల్పించారు. దీంతో మ్యాచ్ లలో జరిగే స్పష్టమైన తప్పిదాలను తగ్గించాలని ఫిఫా లక్ష్యంగా పెట్టుకుంది.
చికిత్స తర్వాత ఒక నిమిషం నిరీక్షణ:
మైదానంలో గాయపడి చికిత్స పొందిన అవుట్‌ఫీల్డ్ ఆటగాళ్లు కనీసం ఒక నిమిషం పాటు మైదానం బయటే ఉండాల్సి ఉంటుంది. అయితే గోల్ కీపర్లు, ఓక్రిఒకరు ఢీ కొట్టిన గాయపడిన ఆటగాళ్లు లేదా తీవ్రమైన గాయాల బారిన పడిన వారికి ఈ నిబంధన వర్తించదు.
నిరసనలకు కఠిన శిక్ష:
రెఫరీ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసే ఆటగాళ్లు, కోచ్‌లపై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. రెఫరీ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆటగాడు మైదానం విడిచి వెళ్లినా, అలాంటి చర్యలను ప్రోత్సహించిన కోచ్ అయినా రెడ్ కార్డు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిరసనల కారణంగా మ్యాచ్ రద్దయితే సంబంధిత జట్టు మ్యాచ్‌ను ఫోర్ఫీట్ చేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.
హైడ్రేషన్ విరామాలు:
అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే వేదికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి అర్ధభాగంలో హైడ్రేషన్ బ్రేక్ లను కూడా ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఆటగాళ్లు నీరు తాగి శరీరాన్ని చల్లబరుచుకునే అవకాశం ఉంటుంది.
The new laws of the game which are set to debut at @FIFAWorldCup 2026 ⚽️ pic.twitter.com/cFKgQzKQrl
— FIFA (@FIFAcom) June 9, 2026
తాజావార్తలు
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!