NTV Telugu Site icon

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో లోయలో పడ్డ ట్యాక్సీ.. ఐదుగురు పర్యాటకులు మృతి

Jammu

Jammu

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గందర్‌బాల్ జిల్లాలోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. ట్యాక్సీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

Nandamuri Balakrishna: తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకండి.. రేవంత్ రెడ్డి

ప్రమాదంలో మృతులుంతా కేరళ వాసులుగా గుర్తించారు. అక్కడ ప్రదేశాలను సందర్శించేందుకు వారు జమ్మూ కాశ్మీర్‌కు వచ్చారు. ప్రమాద సమయంలో ట్యాక్సీలో 8 మంది ఉన్నారు. అందులో 5 మంది మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత సోనామార్గ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Venkata Ramana Reddy: బండి సంజయ్ ను కలిసిన కామారెడ్డి విన్నర్

నివేదికల ప్రకారం.. కేరళ నుండి పర్యాటకులు టాక్సీలో సోనామార్గ్ వెళ్తున్నారని చెబుతున్నారు. వాహనం జోజిలా పాస్ వద్దకు రాగానే అదుపుతప్పి లోతైన లోయలో పడింది. అక్కడికక్కడే నలుగురు చనిపోగా.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. మృతులంతా కేరళలోని చిత్తూరు జిల్లా వాసులు కాగా, ఒక డ్రైవర్ జమ్మూ కాశ్మీర్‌కు చెందినవాడు. ఈ ప్రమాదంలో అరుణ్, రాజేష్, మనుజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఐజాజ్, విఘ్నాష్, రాహుల్, సుదేష్, అనిల్ అనే డ్రైవర్లు చనిపోయారు.