Site icon NTV Telugu

Tamil Nadu: ఓ విద్యార్థికి జ్యూస్లో కలిపి మూత్రం తాగించిన ఇద్దరు విద్యార్థులు.. ఏడాదిపాటు సస్పెండ్

Tamilnadu

Tamilnadu

ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్లో కలిపిన మూత్రాన్ని తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో జరిగింది. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.

Read Also: Ayodhya: రామ మందిరంలో ప్రతిష్టించడానికి ఎంపిక చేయని మరో విగ్రహాన్ని చూశారా..?

బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 6న తన తోటి విద్యార్థులు ఇచ్చిన జ్యూస్‌ను తాగినట్లు చెప్పాడు. కాగా.. ఆ మరుసటి రోజు నుంచి క్లాస్‌రూమ్ లో అతన్ని సహవిద్యార్థులు హేళన చేయడం ప్రారంభించరాన్నారు. చివరకు తనను ఎందుకు ఇలా చేస్తున్నారని తెలుసుకున్న బాధిత విద్యార్థి.. జ్యూస్ లో మూత్రం కలిపి ఇచ్చారని తెలిసిపోయింది. దీంతో ఆ విద్యార్థి వైస్‌ ఛాన్సలర్‌ వి. నాగరాజ్‌కు ఫిర్యాదు చేశాడు.

Read Also: Tragedy: మహారాష్ట్రలో విషాదం.. పడవ బోల్తా పడి ఒకరు మృతి, ఐదుగురు గల్లంతు

కాగా.. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న యూనివర్సిటీ యజమాన్యం, ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జనవరి 18న తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో ఈ ఘటనకు పాల్పడ్డ విద్యార్థులను ప్రస్తుత సంవత్సరంలో 10వ-సెమిస్టర్ పరీక్షలకు హాజరుకాకుండా ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. అంతేకాకుండా.. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని రామ్‌జీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version