ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్లో కలిపిన మూత్రాన్ని తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో జరిగింది. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్‌మేట్‌కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.