Uttarpradesh: పొలంలో చెట్టుకు వేలాడుతూ ఇద్దరు యువతుల మృతదేహాలు.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh: ఇద్దరు యువతులు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. దళిత వర్గానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి ఆ తర్వాత వారిపై లైంగికంగా దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన యూపీలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో ఇద్దరు దళిత అక్కాచెల్లెల్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో లభ్యం కావడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై విచారణ చేపడుతున్నారు.
అయితే, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బైకులపై వచ్చి తమ కూతుళ్లను కిడ్నాప్ చేశారని బాధితురాలి తల్లి ఆరోపించింది. అనంతరం, తన బిడ్డల కోసం వెతుకుతుండగా.. ఓ చోట పొలం వద్ద విగతజీవులుగా చెట్టుకు వేలాడుతూ కనిపించారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కూతుళ్లు ఇద్దరిని.. దుంగడులు కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన తర్వాత ఇలా చెట్టుకు వేలాడదీశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పాటు అనుమతి లేకుండా మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించారని బాధితురాళ్ల తండ్రి వాపోతున్నారు.
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
Snake Man Passes Away: విషపూరిత పాముకాటుతో ‘స్నేక్ మ్యాన్’ మృతి
పోలీసుల వివరాల ప్రకారం.. నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఇద్దరు బాలికలను ఆరుగురు నిందితులు.. గ్రామ శివార్లలోని పొలానికి తీసుకెళ్లారు. అక్కడ ఆరుగురు కలిపి.. వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తమను పెళ్లి చేసుకోవాలని బాధితురాళ్లు బలవంతం చేశారు. దీంతో బాలికలను గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత అక్కాచెల్లెళ్ల మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు. నిందితులను చోటూ, జునైద్, సోహైల్, హఫీజుల్, కరీముద్దీన్, ఆరిఫ్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్ల మృతదేహాలు లభ్యమైన ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ.. యోగి ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!