1983 Cricket World Cup: భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిన 1983 ప్రపంచకప్ విజయానికి నేటితో 43 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆ చారిత్రక విజయాన్ని గుర్తుచేసుకుంటూ కపిల్ దేవ్ నేతృత్వంలోని జట్టుకు అభినందనలు తెలిపింది. “తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం” అంటూ బీసీసీఐ సోషల్ మీడియా వేదిక ప్రత్యేక సందేశాన్ని పంచుకుంది.
1983 జూన్ 25న లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్, అప్పటి రెండు సార్లు వరుసగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ను ఎదుర్కొంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం 183 పరుగులకే ఆలౌట్ అయింది. కృష్ణమాచారి శ్రీకాంత్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. వెస్టిండీస్ బౌలర్లలో ఆండీ రాబర్ట్స్ మూడు వికెట్లు సాధించగా.. మాల్కమ్ మార్షల్, మైఖేల్ హోల్డింగ్, లారీ గోమ్స్ చెరో రెండు వికెట్లు తీశారు.
అయితే భారత బౌలర్లు, ఫీల్డర్లు ఊహించని ఆట తీరుతో మ్యాచ్‌ను మలుపుతిప్పారు. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోతూ 140 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 43 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసి తొలి వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 26 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసిన మొహిందర్ అమర్‌నాథ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచారు. ప్రపంచకప్ ట్రోఫీని లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ “ప్రపంచకప్” ఎత్తిపట్టిన దృశ్యం భారత క్రీడా చరిత్రలో ఇప్పటికి చిరస్థాయిగా నిలిచిపోయింది.
The victory that inspired generations ✨#OTD in 1983, Kapil Dev and his men defended 183 against the West Indies at Lord's to clinch #TeamIndia's maiden World Cup title 🏆 pic.twitter.com/YPWemFFPYY
— BCCI (@BCCI) June 25, 2026
1975, 1979 ప్రపంచకప్‌లలో గ్రూప్ దశనే దాటలేకపోయిన భారత్.. 1983 విజయంతో ప్రపంచ క్రికెట్‌లో శక్తివంతమైన జట్టుగా అవతరించింది. ఆ తర్వాత 2011లో ఎంఎస్ ధోని సారథ్యంలో మరోసారి ప్రపంచకప్ గెలిచిన టీమిండియా, 2023 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2027లో తర్వాతి వరల్డ్ కప్ జరగనుంది.
On Kapil Dev's birthday, re-live his greatest moment as India captain – the 1983 @cricketworldcup final win, including his stunning catch running back to dismiss Sir Viv Richards. pic.twitter.com/89H9chRRDa
— ICC (@ICC) January 6, 2019
A landmark day in Indian cricket history. I#OnThisDay in 1983, India stunned the mighty West Indies by defending just 183.
The turning point came when Kapil Dev ran back to take a brilliant catch to dismiss Viv Richards.
India then triggered a collapse and bowled West… pic.twitter.com/Am3H6KRhle
— Cricketopia (@CricketopiaCom) June 25, 2026
#OnThisDay in 1983
𝗜𝗻𝗱𝗶𝗮 Won their First Worldcup 💥
A triumph that changed Indian cricket forever.Before this tournament, India had never won a single ODI series/tournament away from home (lost 10 out of 10), and entered the World Cup as complete underdogs. Yet, they… pic.twitter.com/bueYSOadgH
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) June 25, 2026

