Site icon NTV Telugu

Delhi: విషాదం.. పై అంతస్తు నుంచి ఏసీ పడి యువకుడు మృతి

Delhi

Delhi

దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవనంలోని మూడో అంతస్తు నుంచి ఏసీ తలపై పడి 19 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు స్కూటర్‌పై కూర్చుని స్నేహితుడితో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు యువకుడి తలపై పడింది. ఈ ఘటన శనివారం (ఆగస్టు 17) జరిగింది. పక్కనే నిల్చున్న మృతుడి స్నేహితుడికి కూడా ఏసీ తగలడంతో అతను కింద పడిపోయాడు. అయితే.. అతను ప్రాణాలతో బయటపడగా.. మరో యువకుడు మృతి చెందాడు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది.

Read Also: Maharashtra: బిస్కెట్లు తిని ఆస్పత్రి పాలైన 80 మంది విద్యార్థులు

ఈ వీడియోలో ఏసీ కిందపడిపోవడం చూపిస్తుంది. ఓ ఇంటి డోర్ దగ్గర ఇద్దరు అబ్బాయిలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లు చూడొచ్చు. వారిద్దరిలో ఒకరు స్కూటర్‌పై కూర్చొని ఉండగా మరొకరు స్కూటర్ పక్కన నిలబడి మాట్లాడుతున్నారు. అలాగే.. అక్కడ రోజూలాగే ఇతర వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారో ఆ వీడియోలో చూడవచ్చు. అందులో ఒకరు ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు కనిపించింది.

Read Also: Jharkhand: హేమంత్ సోరెన్ vs చంపాయి సోరెన్.. బీజేపీ డబ్బుతో కొనాలని చూస్తుందన్న సీఎం..

ఇద్దరు యువకులు బిజీబిజీగా మాట్లాడుతుండగా భవనం మూడో అంతస్తు నుంచి అకస్మాత్తుగా ఏసీ కిందపడింది. బైక్ పై కూర్చున్న బాలుడి తలపై నేరుగా ఏసీ పడటంతో.. దాని తాకిడికి అబ్బాయిలిద్దరూ కుప్పకూలిపోయారు. అయితే.. బైక్ పై కూర్చున్న యువకుడికి ఏసీ బలంగా తాకడంతో ఆ యువకుడు మృతి చెందినట్లు సమాచారం. కాగా.. ఈ విషాదకర ఘటన వీడియో వెలుగులోకి రావడంతో కలకలం రేపింది.

Exit mobile version