Sai Pallavi: సాయి పల్లవి నా క్రష్.. బాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Pallavi: సాయి పల్లవి..అందం, అభినయం కు పెట్టిన పేరు. స్కిన్ షోకు ఆమడ దూరంలో ఉండే ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఆ గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని.. ఇకముందు నుంచి వరుస సినిమాలను చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక సాయి పల్లవి అంటే నచ్చనివారు ఎవరుంటారు. అలాగే ఓకే బాలీవుడ్ నటుడు కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు. చేరిపోవడమే కాదు.. ఆమెతో ఒక సినిమా చేయాలనీ ఉంది.. అదే కనుక జరిగితే అది తన అదృష్టమని చెప్పుకొచ్చాడు. ఇంతకీ అతగాడు ఎవరు అనేగా మీ అందరి ఆలోచన.. అతడే గుల్షన్ దేవయ్య. ఈ మధ్యనే 8AM మెట్రో సినిమాలో సయామీ ఖేర్ తో రొమాన్స్ ఇరగదీసిన నటుడు ఇతనే. ఇక ప్రస్తుతం పలు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న గుల్షన్.. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టాడు. రెండేళ్ల క్రితం భార్యకు విడాకులు ఇచ్చిన ఈ హీరో.. ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు. తన జీవితంలో క్రష్ అని ఎవరైనా ఉంటే.. అది సాయి పల్లవి అని చెప్పుకొచ్చాడు.
SSMB28: మరో మాస్ స్ట్రైక్ ను వదిలిన మేకర్స్
Also Read
“సాయి పల్లవి అంటే నాకు ఎప్పటినుంచో క్రష్. ఆమె ఫోన్ నంబర్ కూడా నా దగ్గర ఉంది. కానీ, ఫోన్ చేసి ఆమెతో మాట్లాడాలంటే భయం. సాయి పల్లవితో ఒక సినిమా చేయాలనీ ఎప్పటినుంచో నాకు కోరిక. ఆమె నటన, డ్యాన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఒక్కసారైనా.. ఒక్క సీన్ లోనైనా సాయి పల్లవితో నటించాలి. అదే కనుక జరిగితే.. నాకు అంతకుమించిన అదృష్టం లేదు. ఇక మిగతా విషయాలను నేను పట్టించుకోని. జీవితంలో ఏది జరగాలని రాసి పెట్టి ఉంటుందో అదే జరుగుతుంది. దాన్ని మనం మార్చలేం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి గుల్షన్ కోరికను సాయి పల్లవి నెరవేరుస్తుందా..? లేదా..? అనేది చూడాలి.
తాజావార్తలు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!