Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 12 Children Rescued As Fire Breaks Out At Rajasthan Medical College

Rajastan : మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 12మంది చిన్నారులను కాపాడిన రెస్క్యూ టీం

Published Date :April 23, 2023 , 10:25 am
By Rakesh Reddy
Rajastan : మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 12మంది చిన్నారులను కాపాడిన రెస్క్యూ టీం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rajastan : రాజస్థాన్ లోని దుంగార్ పూర్ మెడికల్ కాలేజీలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దుంగార్ పూర్ లో ఉన్న ఈ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి 12 మంది చిన్నారులను రక్షించినట్లు కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేంద్ర దామోర్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందగానే మూడు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. వాటి ద్వారా మంటలను ఆర్పి 12 మంది పిల్లలను రక్షించినట్లు ఆయన చెప్పారు.

Read Also: Simhadri Appanna : సింహాచలం చందనోత్సవంలో భక్తుల అందోళన

నవజాత శిశువులు ఉన్న వార్డులో మంటలు చెలరేగాయని, తమ సిబ్బంది పిల్లలను కాపాడారని ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ బాబులాల్ చౌదరి పేర్కొన్నారు. నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదంపై సమాచారం తెలియగానే వెంటనే తన టీమ్ తో కలిసి మూడు వాహనాల్లో వచ్చామని ఆయన తెలిపారు. మంటలను చల్లార్చి, పొగ నుంచి సురక్షితంగా శిశువులను బయటకు తీసుకొచ్చామని వివరించారు. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also:Virupaksha: ‘కాంతార’ రేంజులో రిలీజ్ చెయ్యాల్సిందే…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • children
  • Fire breaks out
  • rajasthan medical college
  • Rescue

తాజావార్తలు

  • Fake IAS Officer: నిత్య పెళ్లికొడుకు బాగోతం.. నకిలీ ఐఏఎస్‌గా 25 సార్లు పెళ్లిళ్లు.. ఎలా చిక్కాడంటే!

  • PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ

  • CM Revanth Reddy: ప్రతి కుటుంబానికి భరోసా.. దేశంలో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదు

  • Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!

  • PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions