Site icon NTV Telugu

Operation Sindoor: 12 మంది శిశువులకు ‘సిందూర్‌’ పేరు..

Sindoor.jpg1

Sindoor.jpg1

పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్‌.. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ మంగళవారం అర్ధరాత్రి పాక్‌ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఈ మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 100 మందికి పైగా టెర్రరిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అని పేరు పెట్టింది. పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్‌ ఆర్మీ ఆపరేషన్‌ సిందూర్‌ అని పేరు పెట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

READ MORE: PSL: పాక్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు కొనసాగింపు.. కానీ..

కాగా.. దేశవ్యాప్తంగా ఆపరేషన్ సిందూర్ పేరు మారుమోగుతోంది. ఉగ్రమూకలపై భారత సైన్యం జరిపిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ వైమానిక దాడులు దేశంలోని సామాన్యప్రజల హృదయాలు సైతం ఉప్పొంగేలా చేశాయి. ఈ సైనికచర్య జరిగిన బుధవారం నాడు.. బీహార్‌లోని ముజఫర్‌పుర్‌ నగర చిన్నపిల్లల ఆస్పత్రిలో పుట్టిన 12 మంది పిల్లలకు తల్లిదండ్రులు ‘సిందూర్‌’ అంటూ పేర్లు పెట్టారు. మగపిల్లలకు సిందూర్, ఆడపిల్లలకు సిందూరి అని నామకరణం చేశారు. ఇక ప్రతి ఏటా తన కుమార్తె పుట్టినరోజుతోపాటు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయోత్సవాన్ని జరుపుకొంటానని కన్హారా వాసి హిమాంశు రాజ్‌ తెలిపారు. జాఫర్‌పుర్‌కు చెందిన పవన్‌ సోనీ తన కుమారుడికి సిందూర్‌ అని పేరు పెట్టారు. బాబు పెద్దవాడై భారత సైన్యంలో చేరాలనేది తన కలగా పవన్‌ సోనీ చెప్పారు.

READ MORE: India-Pakistan War: విదేశాలకు పారిపోవడానికి యత్నిస్తున్న పాక్ ఉన్నతాధికారులు?

Exit mobile version