Civil Supplies Department: ధాన్యం తాజా టెండర్లతో పౌరసరఫరాల శాఖకు రూ.1,110.51 కోట్ల లాభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడాది క్రితం అకాల వర్షాలతో తడిచిన ధాన్యం విక్రయాల్లో పౌరసరఫరాల శాఖకు రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టం వాటిల్లేలా గత ప్రభుత్వం ప్రయత్నించింది. మెట్రిక్ టన్నుకు రూ.3 వేలకుపైగా తక్కువకు టెండర్ కట్టబెట్టినా.. కొనుగోలుదారులు ఆ మొత్తం కూడా చెల్లించేందుకు ఇష్టపడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేశారు. తాజాగా పిలిచిన టెండర్లలో గతం కన్నా ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3 వేలు అదనంగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన పౌరసరఫరాల శాఖకు రూ.1,110.51 కోట్లు అదనంగా సమకూరనుంది.
Tej Pratap Yadav: బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి చేరిక
Also Read
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకారం మెట్రిక్ టన్ను ధాన్యం ధర రూ.20,600. గత ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచి మెట్రిక్ టన్నుకు రూ.17,015.19కు టెండర్లు ఖరారు చేశారు. ఆ లెక్కన 34.59 లక్షల మెట్రిక్ టన్నులకు పౌరసరఫరాల శాఖకు రూ.5,885.55 కోట్లు రావల్సి ఉంది. ఎమ్మెస్పీ ప్రకారం చూస్తే రూ.1,239.99 కోట్లు శాఖ నష్టపోయే పరిస్థితి. అంత తక్కువకే టెండర్లు దక్కించుకున్న కొనుగోలుదారులు ఆ మొత్తం చెల్లించేందుకూ ముందుకు రాలేదు.
Komatireddy Venkat Reddy: కవిత ఇంట్లో ఐటీ సోదాలు.. మంత్రి హాట్ కామెంట్స్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత టెండర్లు రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచారు. తాజా.. టెండర్లలో మెట్రిక్ టన్నుకు రూ.20,225.67కు టెండర్ దాఖలైంది. పాత టెండర్‌తో పోలిస్తే ఇది ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3,210.48 అదనం. ఈ లెక్కన మొత్తం 34.59 లక్షల మెట్రిక్ టన్నులకు తాజా టెండర్ ప్రకారం రూ.6,996.06 కోట్లు రాబడి సమకూరనుంది. పాత టెండర్ల రాబడితో పోలిస్తే ఇది రూ.1,110.51 కోట్లు అదనం.
తాజావార్తలు
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!