ఏడాది క్రితం అకాల వర్షాలతో తడిచిన ధాన్యం విక్రయాల్లో పౌరసరఫరాల శాఖకు రూ.వెయ్యి కోట్లకుపైగా నష్టం వాటిల్లేలా గత ప్రభుత్వం ప్రయత్నించింది. మెట్రిక్ టన్నుకు రూ.3 వేలకుపైగా తక్కువకు టెండర్ కట్టబెట్టినా.. కొనుగోలుదారులు ఆ మొత్తం కూడా చెల్లించేందుకు ఇష్టపడలేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేశారు. తాజాగా పిలిచిన టెండర్లలో గతం కన్నా ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.3 వేలు అదనంగా టెండర్లు దాఖలయ్యాయి. ఈ లెక్కన పౌరసరఫరాల…