108 Ambulance: సహకరించని 108 సిబ్బంది.. ప్రైవేటు ఆటోలో ఆస్పత్రికి బాధితురాలి తరలింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఓ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించారు. 108 వాహనంలో డీజిల్ లేదని, తాము ఏం చేయలేమని చెప్పారు. ఇక చేసేది లేక బాధితురాలిని కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం… మోమిన్‌పేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన సాలెమ్మ (33) కూలీ పనులకు వెళుతూ భర్తకు అండగా ఉంటోంది. కుటుంబ సమస్యల కారణంగా సాలెమ్మ బుధవారం మధ్యాహ్నం ఇంట్లో పురుగు మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది ఆమె ఇద్దరు పిల్లలు గమనించి.. పక్క ఇంట్లో ఉన్న బంధువులకు చెప్పారు. వారు వచ్చేసరికి సాలెమ్మ అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే చికిత్స కోసం మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు.
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
Also Read: IND vs AFG: విరాట్ కోహ్లీ కెరీర్లో ఇదే తొలిసారి.. స్టేడియం మొత్తం గప్‌చుప్!
సాలెమ్మ కుటుంబ సభ్యులు 108కు కాల్ చేయగా.. వాహనంలో డీజిల్ లేదని, ఇప్పుడు తాము ఏం చేయలేమని తెలిపారు. దాంతో సాలెమ్మను కుటుంబ సభ్యులు మోమిన్‌పేట నుంచి సదాశివపేట ఆసుపత్రికి ప్రైవేటు ఆటోలో తీసుకెళ్లారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం సాలెమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 108 వాహన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సాలెమ్మ కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే పండగ సందర్భంగా కార్యాలయానికి సెలవు ఉందని, అందుకే 108 వాహనంలో డీజిల్ పోయించలేదని సిబ్బంది చెబుతున్నారు.
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!