Vizag Steel Plant: విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ.. ఉక్కు ఉద్యమానికి 1000 రోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరాహార దీక్షలు ఇవాళ్టికి 1000 రోజులకు చేరుకుంది. స్టీల్ ప్లాంట్‌ను 100 శాతం వ్యూహాత్మక అమ్మకం చేయాలని 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉక్కు కార్మిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పలు రకాలుగా నిరసనలు నిర్వహించింది. ఢిల్లీలో రెండు రోజులు ధర్నాలు చేశారు. ముఖ్యంగా జాతీయ రహదారిని రెండు రోజుల పాటు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దిగ్భందించారు.
Read Also: Top Headlines @9AM : టాప్ న్యూస్
Also Read
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
ఇప్పటికే పలు సార్లు కార్మికులు స్టీల్‌ప్లాంట్ పరిపాలన భవనంతో పాటు గేట్లను ముట్టడి చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని చెప్పడంతో.. అమ్మకాల ప్రక్రియలకు ట్రాన్సాక్షన్, లీగల్ అడ్వైజర్ల నియామకాలు చేపట్టింది. ఉక్కు ఉద్యమానికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, రచయితలు, మేధావులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలకు చెందిన వారు మద్దతిస్తూ దీక్షల్లో పాల్గొంటున్నారు. ఈ దీక్షలు ప్రారంభించి నేటికి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఇవాళ వివిధ రూపాల్లో ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నారు.
Read Also: Raja Singh: మోడీ సభకు రాజాసింగ్ డుమ్మా.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే
ఇక, దీక్షలు ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా నేడు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేయనున్నారు. అదే విధంగా కాలేజీలు, స్కూల్స్ బంద్ చేయాలని ఉక్కు పోరాట కమిటీ నేతలు కోరారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ దీక్ష శిబిరం దగ్గరకు స్టీల్ కార్మిక సంఘ నేతలు ఉద్యోగులు భారీగా చేరుకున్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటాం అని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!