Aadhaar Card: 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డ్‌ని అప్ డేట్ చేసుకోండి.. సెప్టెంబర్ 14 వరకే ఫ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar Card: ప్రస్తుతం ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. అనేక ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు అవసరం. ప్రజలు ఆధార్ కార్డుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ జారీ అయిన తర్వాత చాలా మంది ఇప్పటి వరకు అప్ డేట్ చేయలేదు. దీంతో పదేళ్లు దాటి ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రస్తుతం ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మంచి అవకాశం వచ్చింది. సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సేవ కేవలం myAadhaar పోర్టల్‌లో మాత్రమే ఉచితం. మిగిలిన కేంద్రాల్లో మునుపటిలాగానే వసూలు చేస్తున్నారు. సెప్టెంబర్ 15, 2023 నుండి myAadhaar పోర్టల్‌లో కూడా డబ్బులు వసూలు చేస్తారు.
Read Also:Sunday: ఆదివారం పుట్టిన వారి లక్షణాలు.. ఆ ఒక్కటే వారిలో మైనస్
Also Read
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ వివరాలు, సంబంధిత పత్రాలను అప్లోడ్ చేసే సదుపాయాన్ని కల్పించింది. ఇంతకుముందు ఈ ఉచిత సేవ జూన్ 14, 2023 వరకు మాత్రమే ఉండేది. అయితే తర్వాత ఇది సెప్టెంబర్ తేదీ వరకు పొడిగించబడింది. దేశంలోని నివాసితులందరికీ ఆధార్ నమోదు ఉచితం. ఆధార్ సంఖ్య ప్రజలందరికీ ప్రత్యేకమైనది. ఈ సంఖ్య జీవితకాలం వరకు చెల్లుబాటులో ఉంటుంది. నివాసితులు బ్యాంకింగ్, మొబైల్ ఫోన్ కనెక్షన్, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలను సరైన సమయంలో పొందేందుకు ఆధార్ నంబర్ సహాయపడుతుంది.
UIDAI నుండి అందిన సమాచారం ప్రకారం పదేళ్లుగా తమ ఆధార్‌ను అప్డేట్ చేసుకోని ఆధార్ వినియోగదారులు వారు తమ ఆధార్‌ను వీలైనంత త్వరగా అప్డేట్ చేసుకోవాలి. ఎవరైనా వినియోగదారులు తమ ఆధార్‌ను అప్డేట్ చేయకుంటే, భవిష్యత్తులో ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించుకోవడంలో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ ఉచిత సేవ myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆధార్ కేంద్రాలను సందర్శించడం ద్వారా భౌతికంగా నవీకరణ జరిగితే, ప్రజలు ఆధార్ కేంద్రాలలో అవసరమైన రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ప్రజలు సెప్టెంబర్ 14 వరకు ఆధార్ కార్డును ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
Read Also:SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 7547 ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఎలా అప్డేట్ చేసుకోవాలంటే..
1. ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ https://myaadhaar.uidai.gov.in/ని సందర్శించాలి.
2. చిరునామాను అప్డేట్ చేయడానికి ప్రొసీడ్ ఎంపికను ఎంచుకోండి.
3.రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
4.‘డాక్యుమెంట్ అప్డేట్’పై క్లిక్ చేయాలి. నివాసి ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.
5.ఆధార్ వినియోగదారులు తమ వివరాలను ధృవీకరించాలి. సరైనదని గుర్తించినట్లయితే,నెక్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
6.తదుపరి దశలో, డ్రాప్‌డౌన్ జాబితా నుండి గుర్తింపు రుజువు, చిరునామా పత్రాల రుజువును ఎంచుకోవాలి.
7.చిరునామా రుజువు స్కాన్ చేసిన కాపీని అప్లోడ్ చేయాలి. మీరు ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయాలి. మీ పత్రాలను అప్డేట్ చేయడానికి, మీరు దాని కాపీని అప్లోడ్ చేయాలి.
8.చివరగా ఆధార్ అప్డేట్ అభ్యర్థన ఆమోదించబడుతుంది. 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) జనరేట్ చేయబడుతుంది.
తాజావార్తలు
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..