10 women won in Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మహిళా ఎమ్మెల్యేల సంఖ్య పెరగనుంది. మొదటిసారి రెండంకెల సంఖ్యలో మహిళలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో.. ప్రధాన పార్టీల నుంచి 34 మంది మహిళలు పోటీ చేశారు. అత్యధికంగా బీజేపీ 13 మంది మహిళలకు టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి 12 మందికి, బీఆర్ఎస్ నుంచి 8 మందికి, జనసేన నుంచి ఒకరికి టికెట్ దక్కాయి. అన్ని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తంగా 221 మంది మహిళలు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
Also Read: Suryakumar Yadav: సమష్టి ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాం: సూర్య
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో 221 మంది మహిళలు పోటీ చేయగా.. 10 మంది గెలిచారు. 2014 నుంచి చూస్తే 10 మంది మగువలు అసెంబ్లీ గడప తొక్కనుండడం ఇదే మొదటిసారి. ఈసారి విజయం సాధించిన మహిళల్లో కాంగ్రెస్ నుంచి 6 గురు ఉండగా.. బీఆర్ఎస్ నుంచి నలుగురు ఉన్నారు. గెలిచిన 10 మందిలో నలుగురు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారే కావడం గమనార్హం. ఇందులో ముగ్గురు కాంగ్రెస్ నుంచి.. మరొకరు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు.