Fuel Tanker Explosion: జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న దక్షిణాఫ్రికా నగరమైన బోక్స్‌బర్గ్‌లో ఇంధన ట్యాంకర్ పేలడంతో 10 మంది మరణించగా.. 40 మంది గాయపడ్డారని అత్యవసర సేవలు శనివారం తెలిపాయి. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణా చేస్తున్న ట్యాంకర్ శనివారం ఉదయం ఓ వంతెన కింద ఇరుక్కుపోయింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. కానీ దురదృష్టవశాత్తు ట్యాంకర్ పేలిందని ఆ ప్రాంతంలోని అత్యవసర సేవల ప్రతినిధి విలియం తెలిపారు.
Tsunami in Indonesia: ప్రకృతి బీభత్సానికి 18 ఏళ్లు..
గాయపడిన వారిలో డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. శనివారం తొమ్మిది మంది మరణించగా, మృతుల సంఖ్య 10కి పెరిగిందని ఆయన చెప్పారు. గాయపడిన వారిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉండగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడినప్పటికీ పరిస్థితి నిలకడగా ఉంది. ఆరుగురు అగ్నిమాపక సిబ్బందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో ఆ ట్యాంకర్ 60,000 లీటర్ల ఎల్పీజీ గ్యాస్‌ను తీసుకువెళుతోంది.