Site icon NTV Telugu

YS Sharmila: హస్తం గూటికి వైఎస్ షర్మిల.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే, రాహుల్

Ys Sharmila

Ys Sharmila

YS Sharmila: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ అగ్రనేతలు. అనంతరం ఆమో వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆనంతరం షర్మిల మాట్లాడుతూ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని ఆమె అన్నారు. ఆయన బిడ్డగా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు షర్మిల. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పజెప్పినా.. స్వీకరిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడాలనన్నదే తమ లక్ష్యమని.. అందుకోసం అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు షర్మిల.

Read also: Maldives President: భారత్ సైన్యాన్ని తొలగించకపోతే మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది..

నిన్న(బుధవారం) రాత్రి వైఎస్ షర్మిల తన భర్త అనిల్ తో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. వైఎస్ షర్మిలకు ఏఐసీసీలో స్థానం లభించడం లేదా ఆంధ్రప్రదేశ్ పీసీసీ (ఏపీసీసీ) అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే… షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రాహుల్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో ఆయన, మల్లికార్జున్‌ఖార్గే షర్మిలను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో షర్మిలకే ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Read also: Guntur Kaaram: ఆయన అడ్డా యుఎస్ అనుకుంటే… యుకే ర్యాంపేజ్ చూపిస్తుందిగా

ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే?

నిన్న వైఎస్ షర్మిల తాడేపల్లిలోని తన సోదరుడు సీఎం జగన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిసారు. అన్న వైఎస్ జగన్ తన కుమారుడి నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను వదిన భారతికి అందించారు. ఈ సందర్భంగా… తాడేపల్లి వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయంలో దిగిన వైఎస్ షర్మిని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కలిశారు. ఆమెకు స్వాగతం పలికిన అనంతరం క్వానైతో కలిసి సీఎం జగన్‌ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత…ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటానని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. దీన్ని బట్టి చూస్తే… షర్మీకి ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. షర్మిల ఏపీసీసీ అధ్యక్షురైతే… సీఎం జగన్‌తో ఢీకొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న సీఎం జగన్ కూడా.. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే… 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అన్నా చెల్లెల్ల మధ్య రాజకీయ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Weather Update: పెరుగుతున్న చలి.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..!

Exit mobile version