Weather Update: పెరుగుతున్న చలి.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Update: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న చలిగాలుల కారణంగా చలి గాలులు పెరిగాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రిపూట చలి ఎక్కువగా ఉండగా, పగటిపూట ఎండ తీక్షణంగా ఉంటుంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు స్వల్పంగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో నేడు, రేపు ఉదయం కొన్ని జిల్లాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రం భీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.ఈ జిల్లాల్లో ఉదయం పూట పొగమంచు కమ్ముకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.
Read also: Mohammed Siraj: రెండు ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేస్తామని అనుకోలేదు: సిరాజ్
Also Read
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 17 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కి.మీ వేగంతో ఆగ్నేయ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా నమోదైంది. గాలి తేమ 80 శాతంగా నమోదైంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తాలోని యానాంలో ఈశాన్య, తూర్పు దిశల్లో గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నాయని చెప్పారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉంటుందని, రాయలసీమలో కూడా వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పారు. అయితే ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Moblie Blast: జేబులో పేలిన సెల్‌ఫోన్.. యువకుడికి తీవ్రగాయాలు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?