సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారంపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ 12 ఏళ్ల తర్వాత సెట్ అవ్వడంతో గుంటూరు కారం ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే బజ్ జనరేట్ చేసింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ హైప్ మరింత పెరుగుతోంది. మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ స్టెప్పులు వేస్తే అభిమానుల సంతోషాన్ని ఆపడం కష్టమే. ఇదే ఈవెంట్ నుంచి గుంటూరు కారం ట్రైలర్ కూడా బయటకి రాబోతుంది. ట్రైలర్ ని పర్ఫెక్ట్ గా కట్ చేస్తే గుంటూరు కారం దెబ్బకి సంక్రాంతి రిలీజ్ అవ్వనున్న సినిమాలు వెనక్కి తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు అనగానే నార్త్ అమెరికా, యుఎస్ మార్కెట్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ఉంటాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు నార్త్ అమెరికాలో సాలిడ్ ఓపెనింగ్స్ ని రాబట్టి ప్రీమియర్స్ లో కొత్త రికార్డులు సృష్టిస్తాడు అనుకుంటే… సడన్ యుఎస్ ని కూడా బీట్ చేసే రేంజులో యుకే బుకింగ్స్ రేస్ లోకి వచ్చాయి. గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లోని మేజర్ సెంటర్స్ లో ఓపెన్ అయ్యాయి. అలా ఓపెన్ చేసారో లేదో ఇంకా కంప్లీట్ అవుతూ మహేష్ రేంజ్ ఏంటో చూపిస్తున్నాయి. ఒడియన్ చైన్ ఆఫ్ థియేటర్స్ లో అయితే గుంటూరు కారం టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రిలీజ్ కి ఇంకా డేట్ ఉంది కాబట్టి ఈసారి యుఎస్ ప్లేస్ లో యుకే ప్రీమియర్ బుకింగ్స్ లో కొత్త హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది.
The wait is over! 🔥 Super @urstrulyMahesh's
😎#GunturKaaram UK THEATRE LIST HERE🇬🇧#GunturKaaram #GunturKaaramOnJan12th 🌶@cineworld @vuecinemas @ODEONCinemas pic.twitter.com/QadkCklgZC— Boleyn cinema (@cinema_boleyn) January 3, 2024