పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ హర్యానకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 రోజుల పాటు విచారించి.. అనేక విషయాలు రాబట్టారు. అనంతరం పలువురు యూట్యూబర్లను నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పట్టుబడింది. పోలీసుల కస్టడీ అనంతరం ఆమెను హర్యానాలోని హిసార్ జైలుకు తరలించారు. బుధవారం జైల్లో మల్హోత్రాను తండ్రి హరీష్ కలిశారు. జరిగిన పరిణామాలను తండ్రి అడిగి తెలుసుకున్నారు.
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు పేర్కొన్నారు. శనివారం ఆమెను అరెస్ట్ చేయగా.. న్యాయస్థానం ఆమెను ఐదు రోజులు కస్టడీకి ఇచ్చింది. దీంతో అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.
Honeytrap: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఫ్యాక్టరీకి చెందిన సున్నిత వివరాలను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి లీక్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘హానీ ట్రాప్’’లో చిక్కుకున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్లతో రహస్య సైనిక సమాచారాన్ని పంచుకున్నారని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (UP ATS) ఆగ్రాకు చెందిన రవీంద్ర కుమార్‌తో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేసింది.
Spying: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) అరెస్ట్ చేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఇద్దరు వ్యక్తులు టెర్రర్ ఫైనాన్సింగ్‌కి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో పంజాబ్‌లోని భటిండాకు చెందిన అమృత్ గిల్ అలియాస్ అమృత్ పాల్ (25), ఘజియాబాద్‌లోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరీద్‌నగర్‌లో నివసిస్తున్న రియాజుద్దీన్ (36)లను ATS అరెస్టు చేసింది.
పలు ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ సంస్థ వార్నింగ్ అలర్ట్ పంపింది. ప్రతిపక్ష ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ తమ ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు యాపిల్ హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.