YouTube: “తప్పుడు థంబ్‌నెయిల్స్, టైటిల్స్ పెట్టారో అంతే సంగతి”.. యూట్యూబ్ కొత్త పాలసీ వివరాలు..
- తప్పుడు థంబ్‌నెయిల్స్, టైటిల్స్ పెట్టారో అంతే సంగతి..
- వీడియోను తీసేస్తామని హెచ్చరించిన యూట్యూబ్..
- వీక్షకుడిని మోసం చేసలా ప్రవర్తిస్తే చర్యలు..
- కొత్త పాలసీని తీసుకువచ్చిన యూట్యూబ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YouTube: యూట్యూబ్ తప్పుడు “థంబ్‌నెయిల్స్”, “టైటిల్స్”పై చర్యలకు తీసుకునేందుకు సిద్ధమైంది. వినియోగదారుల్ని మోసగించే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కొత్త పాలసీని తీసుకురాబోతోంది. చాలా సందర్భాల్లో యూట్యూబ్‌లో వ్యూస్ కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉండే ‘‘క్లిక్‌బైట్’’ వీడియోలపై కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి వీడియోలను తొలగిస్తామని ఇండియన్ కంటెంట్ క్రియేటర్లను హెచ్చరించింది. ఈ మేరకు కొత్త నిబంధనలను అమలు చేసే ప్లాన్‌ని ప్రకటించింది.
తప్పుడు థంబ్‌నెయిల్స్, క్లిక్‌బైట్ హెడ్డింగ్స్ అంటే ఏమిటి..?
Also Read
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
- Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
- Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
- SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
థంబ్‌నెయిల్స్, క్లిక్‌బైట్స్ కంటెంట్‌పై వీక్షకుడి ఇంట్రెస్ట్ పెంచేలా చేస్తాయి. వీడియోని చూసేలా ప్రేరేపిస్తాయి. వీటిని చూడటం వల్ల వీక్షకుడికి క్రియేటర్లు ఏ కంటెంట్ ఇవ్వబోతున్నారనేది అర్థమవుతుంది. అయితే, కొన్ని సందర్భాల్లో వీరిని తప్పుదోవ పట్టించేందుకు, సంచలనాల కోసం తప్పుడు థంబ్‌నెయిల్స్, హెడ్డింగ్స్ పెడుతున్నారు. వీటికి లోపల ఉన్న వీడియోకి అసలు సంబంధం ఉండటం లేదు. ఇలా చేయడం వల్ల వీక్షకుడు తన అమూల్యమైన సమయాన్ని కోల్పోవడంతో పాటు తాను మోసపోయాననే ఫీలింగ్‌లో ఉంటున్నాడు.
Read Also: Ujjain: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చర్చిపై రాతలు..
యూట్యూబ్ కొత్త పాలసీ ఏం చెబుతోంది.?
అసాధారణ క్లిక్‌బైట్స్ ఉన్న వీడియోలను తొలగిస్తామని యూట్యూబ్ చెబుతోంది. వీక్షకులు ఖచ్చితమైన, సమయానుకూల సమాచారాన్ని కోరుతున్నందున బ్రేకింగ్ న్యూస్, కరెంట్ ఈవెంట్స్‌కి సంబంధించిన కంటెంట్‌ని నిశితంగా పరిశీలిస్తామని యూట్యూబ్ తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది.
ఉదాహరణకు ‘‘ ప్రెసిడెంట్ రాజీనామా’’ లేదా ‘‘బ్రేకింగ్ పొలిటికల్ న్యూస్’’ వంటి ఆకర్షణీయమైన టైటిల్స్ ఉన్న థంబ్‌నెయిల్స్ పెట్టిన వీడియోలో, దీనికి సంబంధించిన వివరాలు ఉండకుంటే ఇది యూట్యూబ్ రూల్స్‌ని ఉల్లంఘించినట్లే. తప్పుడు థంబ్‌నెయిల్స్, టైటిల్స్ ఉన్న వీడియోలను తొలగిస్తామని యూట్యూబ్ స్పష్టం చేస్తోంది.
యూట్యూబ్ ఈ చర్యలకు ఎందుకు తీసుకుంటోంది..?
ముఖ్యంగా వార్తలకు సంబంధించిన కంటెంట్ విషయానికి వస్తే, యూట్యూబ్ తన విశ్వసనీయతను పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటోంది. వీక్షకులు విశ్వసనీయ సమాచారం కోసం యూట్యూబ్‌ని ఆశ్రయించినప్పుడు తప్పుదాడి పట్టించే, హానికరమైన కంటెంట్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కంటెంట్ క్రియేటర్ల క్రియేటివిటీని ప్రోత్సహించడంతో పాటు జవాబుదారీతనం మధ్య బ్యాలెన్స్ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!